OPPO Reno14 5G విడుదల అయిన వారాల తర్వాత కూడా ట్రెండ్‌లో ఉండడానికి 5 కారణాలు
స్మార్ట్‌ఫోన్‌ల విడుదల సమయానికి బాగా ప్రచారంలో ఉంటాయి. విడుదల అనంతరం ఫీచర్లు సహా పనితీరుతో ట్రెండ్‌లో ఉంటాయి. అయితే క్రమంగా కొన్నిఫోన్‌ల హైప్ తగ్గిపోతుంది. అందుకు అనేక కారణాలుంటాయి. అయితే కొన్ని ఫోన్‌లు మాత్రం ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తుంటాయి. కాల్స్, కెమెరా సహా అనేక విధాలుగా ఆకట్టుకుంటాయి.
అలాంటి అరుదైన స్మార్ట్‌ఫోన్‌లలో OPPO Reno14 Series ఒకటి. విడుదల అయిన వారాల తర్వాత కూడా Reno14 5G, Reno14 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు, కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల సహా అన్నింటా ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు మార్కెటింగ్ కారణం కాదు. కేవలం రోజువారీ పనితీరే కారణం. అయితే Reno14 సిరీస్ మీ దృష్టిని ఎందుకు అంతగా ఆకర్షించింది.

ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ కెమెరా అనుభూతి
అనేక పరీక్షల అనంతరం కూడా రెనో 14 సిరీస్ కెమెరాలు ముఖ్యంగా పొర్ట్రెయిట్ మరియు తక్కువ కాంతిలోనూ అద్భుతమైన పనితీరును కనబరిచాయి. హైపర్‌టోన్ 50MP క్వాడ్ కెమెరా సిస్టమ్‌ను కలిగిన ప్రో మోడల్, హైపర్‌టోన్ 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగిన బేస్ వేరియంట్ రెండు కూడా 3.5 ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఇదే ధరలో ఉన్న ఇతర మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తున్నాయి.

ఈ ఫోన్‌లు ట్రిపుల్ AI ఫ్లాష్‌లైట్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. అంటే మెయిన్, అల్ట్రావైడ్ కెమెరాల కోసం రెండు ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉన్నాయి. మరియు తొలిసారిగా ప్రత్యేకంగా టెలిఫోటో లెన్స్‌కు కూడా ఫోకస్ ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. ఫలితంగా రాత్రి వేళల్లోనూ ఆకట్టుకొనేలా క్యాప్చర్ చేయవచ్చు. ఈ రెండు ఫోన్‌లు 60fps వద్ద 4K HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్టు చేస్తాయి. అత్యంత నాణ్యమైన విజువల్స్ కోరుకొనే క్రియేటర్‌లకు మరియు వ్లాగింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటాయి.

AI సపోర్టు మరిన్ని అనుకూలతలను తీసుకొస్తుంది. AI Editor 2.0 ద్వారా ఫోటోలను ఆప్టిమైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు AI ఫ్లాష్ ఫోటోగ్రఫీ కూడా వృద్ధి చెందింది. దీంతోపాటు ఫ్లాష్ మోడ్, ఫిల్ లైట్ వంటి రెండు ప్రొఫెషనల్ లైటింగ్ మోడ్స్‌ను కలిగి ఉంది. తక్కువ వెలుతురు, రాత్రి వేళల్లో క్యాప్చర్ చేసినా మంచి అనుభూతిని అందిస్తాయి.
సమయాన్ని ఆదా చేసే AI ఎడిటింగ్ టూల్స్
ఆ AI ఎడిటింగ్ టూల్స్ చాలా సమయాన్ని ఆదా చేస్తాయి. ఇందులో AI Editor 2.0 సూట్ మరింత అనుకూలంగా ఉంటుంది. ఫోటోలో అవసరం లేని వస్తువులు, వ్యక్తులను తొలగించడం మరియు గ్లాస్ రిఫ్లక్షన్‌ను తొలగించడం వంటి అనేక సమస్యలకు సెకన్లలో పరిష్కారం చూపుతుంది.

గత కొన్ని వారాలుగా AI Recompose మరియు AI Eraser వంటి ఫీచర్‌లు ట్రావెల్ ఫోటోగ్రఫీకి అనుకూలంగా మారాయి. విండో నుంచి ల్యాండ్‌మార్క్‌ను షూట్ చేయడం మరియు అద్భుతమైన షాట్‌లను క్యాప్చర్ చేయడం వంటి చేయవచ్చు. దీంతోపాటు AI Unblur టూల్ పెంపుడు జంతువులు, అటు ఇటు తిరుగుతున్న చిన్నారులకు క్యాప్చర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి ఎడిటింగ్ కోసం చాలా సమయాన్ని ఆదా చేస్తాయి.
కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకుంటుంది
రెనో 14 సిరీస్ ఎక్కువ మన్నిక వచ్చే ఫోన్‌తోపాటు IP66, IP68, IP69 రేటింగ్ ను కలిగి ఉంది. ఫలితంగా డస్ట్, వాటర్ సహా అధిక పీడనంతో కూడిన స్ల్పాష్‌లను కూడా తట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్షలను కూడా ఎదుర్కొంది. ఈ ఫోన్ అండర్‌వాటర్ ఫోటోగ్రఫీకి కూడా అనుమతిస్తుంది. అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కారణంగా వర్షాలు కురుస్తున్నా.. పొడి వాతావరణ పరిస్థితుల్లోనూ 4K రిజల్యూషన్‌తో ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు.

అనేక వారాల వినియోగం అనంతరం కూడా OPPO వెల్వెట్ గ్లాస్ ఫినిషింగ్ ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది మరియు మంచి అనుభూతిని అందిస్తుంది. వన్‌పీస్ స్కల్ప్టెడ్ గ్లాస్ ఫినిషింగ్ కారణంగా ఆకట్టుకొనే విధంగా ఉండడంతోపాటు పట్టుకొని ఉపయోగించుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు అంతర్గత కుషనింగ్ కారణంగా స్టైలిష్ లుక్ సొంతం కావడమే కాకుండా కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకుంటుంది.
రోజువారీ పనుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
ఈ సిరీస్‌లో అమర్చిన AI Call Summary మరియు AI VoiceScribe వంటి ఫీచర్లు రోజువారీ వినియోగంలో ఇంటిగ్రేట్ అయ్యాయి. ఇంటర్వ్యూలు లేదా కాల్స్‌లో తక్షణ ట్రాన్స్‌లేషన్ కోసం మరియు సారాంశాల కోసం ఉపయోగపడుతున్నాయి. రెనో 14 సిరీస్ కేవలం కమ్యూనికేషన్ కోసం వినియోగించే డివైజ్‌గానే కాకుండా పర్సనల్ అసిస్టెంట్‌గా మారిపోయింది.
ఒప్పో నోట్స్, క్యాలెండర్, క్లాక్‌తో జెమిని ఇంటిగ్రేషన్ మరింత సౌకర్యంగా మారింది. మేము ఇటీవల పెద్ద పెద్ద డాక్యుమెంట్స్‌ను చిన్న సారాంశాలుగా మార్చుకున్నాం. టెక్ట్స్ నుంచి ఆటో రిమైండర్‌లు, వాయిస్ నోట్ నుంచి పాయింట్లుగా మార్చుకున్నాం. ఇందుకోసం అనేక యాప్‌ల కోసం వెతకకుండా ఈ ఫీచర్లలో సౌకర్యవంతంగా పనిచేసుకున్నాం.

దీంతోపాటు ఏఐ మైండ్ స్పేస్ ఫీచర్ మరో హైలెట్‌గా నిలిచింది. మీరు చేయవలసిన పనులు, మీ ఆలోచనలను స్పష్టమైన లేఅవుట్ రూపంలో రూపొందించేందుకు సాయం చేస్తుంది. ఇది డిజిటల్ ప్రొడక్టివిటీకి కొత్త మార్గంగా భావించాల్సి ఉంటుంది.
బ్యాటరీ మరియు పనితీరు
రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సమయం వీడియో ఎడిటింగ్ చేసినా, గేమింగ్ కోసం వినియోగించినా వేడెక్కడం లేదా పనితీరులో ఎటువంటి ప్రభావం ఉండదు. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ఇందుకు కారణం. ఒప్పో నానో డ్యూయల్ డ్రైవ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా 4K వీడియోలను ఎడిటింగ్ చేసినా, ఎక్కువ యాప్‌లను ఉపయోగించినా, కెమెరా మోడ్స్‌లో నిరంతర మార్పులు చేస్తూ వినియోగించినా పనితీరులో ఎటువంటి ప్రభావం లేకుండా పనులన్నీ సజావుగా జరుగుతాయి.

రెనో 14 ప్రో మోడల్ 6200mAh బ్యాటీరీని కలిగి ఉంది. అదే బేస్ వేరియంట్ 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. రెండు ఫోన్‌ల బ్యాటరీ లైఫ్ సులభంగా రోజున్నర వరకు వస్తుంది. 80W SUPERVOOC TM ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జీ చేయవచ్చు. అయితే ప్రో వేరియంట్ 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది.
చివరగా..
రెనో 14 సిరీస్ కొన్నివారాల తర్వాత కూడా ట్రెండ్‌లో ఉండే సిరీస్ గా ఉంటుంది. కెమెరా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు కూడా సౌకర్యంగా ఉంటాయి. బ్యాటరీ లైఫ్, మన్నిక, డిజైన్ అధిక ధర కలిగిన ఫోన్‌ల కంటే మెరుగ్గా ఉంటుంది. ఒప్పో హార్డ్‌వేర్ మరియు వినియోగంలోనూ మంచి అనుభూతి, మన్నిక వచ్చేలా కృషి చేసింది.

ఈ ధరలో వచ్చిన ఇతర ఫోన్‌ల కంటే ఒప్పో రెనో14 సిరీస్ అన్నింటా మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

ఇటీవలే మరింత కొత్తగా
OPPO Reno14 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే మింట్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. స్లీక్ డిజైన్‌తోపాటు రోజువారి వినియోగానికి అనువుగా ఉండే టెక్నాలజీ ని కలిగి ఉంది. మరియు స్టైలిష్ లుక్‌ను కూడా కలిగి ఉంది. ఫోటోలు క్యాప్చర్ చేస్తున్నా.. స్క్రోల్ చేస్తున్నా అన్నింటా ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications








