సైలెంట్‌గా వచ్చి సంచలనాలు రేపుతోన్న Honor 5C

|

హువావే ఆన్‌లైన్ స్పెసిఫిక్ బ్రాండ్ Honor, పవర్ ప్యాకుడ్స్ స్పెక్స్‌తో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌‍ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Honor 5C పేరుతో కొద్ది రోజుల క్రితం ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.10,999..

సైలెంట్‌గా వచ్చి సంచలనాలు రేపుతోన్న Honor 5C

అధునాత Kirin 650 చిప్‌సెట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో మల్టీ టాస్కింగ్‌తో పాటు బ్యాటరీ బ్యాకప్ సరికొత్త స్టాండర్డ్స్‌ను నెలకొల్పాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో హైక్వాలిటీ స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు ప్రాసెసర్ వెన్నుముకలా నిలుస్తుంది. Honor 5C ఫోన్‌ గురించి 5 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Read More : కిక్కుతో పాటు టెన్సన్ రేకెత్తించే ఫోటోలు

 మెటల్ బాడీ ఫోన్, హీటింగ్ సమస్యే ఉండదు!

మెటల్ బాడీ ఫోన్, హీటింగ్ సమస్యే ఉండదు!

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్ బాడీని ఎయిర్ క్రాఫ్ట్‌గ్రేడ్ అల్యుమినియమ్ మిశ్రమంతో తీర్చిదిద్దారు. ప్రీమియమ్ లుక్‌తో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. కూల్ ఛాసిస్, ఫోన్‌ను ఒక్క చేతితో హ్యాండిల్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఓవర్ హీటింగ్‌కు తావే ఉండదు. ఇదే ధర రేంజ్‌లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి.

ప్రాసెసింగ్ కేక..

ప్రాసెసింగ్ కేక..

ఆక్టా కోర్ సీపీయూ ఇంకా 16ఎన్ఎమ్ ప్రాసెసింగ్ పవర్‌తో డిజైన్ చేసిన కైరిన్ 650 చిప్‌సెట్‌ను హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్ కంటే మెరుగైన పనితీరును 650 చిప్‌సెట్ కనబర్చలదని కంపెనీతో చెబుతోంది. మునుపటి తరం 28ఎన్ఎమ్ చిప్‌సెట్‌లతో పోలిస్తే 16ఎన్ఎమ్ చిప్‌సెట్‌లు మెరుపు వేగంతో స్పందిస్తాయి. హెవీ యాప్‌‍లను సైతం హానర్ 5సీ ఫోన్‌లు సులువుగా హ్యాండిల్ చేయగలవు. హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లో హీటింగ్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఫోన్ నిదానించటం, లాగింగ్‌కు గురికావటం వంటి అవాంతరాలు దాదాపుగా ఉండవు. హెవీ యాప్స్‌ను సైతం ఈ చిప్‌సెట్‌ స్మూత్‌గా డీల్ చేస్తుంది.

అంతరాయంలేని గేమింగ్..

అంతరాయంలేని గేమింగ్..

హానర్ 5సీ ఫోన్‌లో పొందుపరిచిన కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగంతో పనిచేయగలదని కంపెనీ చెబుతోంది. ఈ చిపెసెట్‌తో పెయిర్ చేసిన మాలీ - టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులకు చక్కటి విందు.

 ప్రొఫెషనల్ క్వాలిటీ కెమెరా...

ప్రొఫెషనల్ క్వాలిటీ కెమెరా...

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్, పీడీఏఎఫ్, నైట్ మోడ్, గుడ్ ఫుడ్ మోడ్, బ్యూటీ మోడ్, లైట్ పెయింటింగ్ మోడ్ వంటి పీచర్లు ఫోన్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి. కెమెరాలో నిక్షిప్తం చేసిన స్మార్ట్‌ఇమేజ్ 3.0 ఇమేజ్ ప్రాసెసర్ డీఎస్ఎల్ఆర్ తరహాలో అనుభూతులను చేరువచేసే విధంగా వివిధ వెరైటీల క్రియేటివ్ ఫిల్టర్స్ ఇంకా షూటింగ్ మోడ్‌లను ఆఫర్ చేస్తుంది.

 లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ...

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ...

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌‌తో ఆకట్టుకుంటుంది. ఈ బ్యాటరీ నిర్మాణంలో భాగంగా 650Wh/L ఎనర్జీ డెన్సిటీతో పాటు, కాంపాక్ట్ డిజైనింగ్‌ను హావావే ఎంచుకుంది. కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందించటంతో ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మరింత ఆదా అవుతుంది.

Best Mobiles in India

English summary
5 Reasons Why Honor 5C has the most powerful chipset at this price range. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X