Home
Mobile

హానర్ 9N స్టైలిష్ ఫోన్ అనటానికి 5 ప్రధాన కారణాలు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల హవా నడుస్తుంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల హవా నడుస్తుంది. దిగ్గజ కంపెనీలన్నీ తమదైన మార్క్ వేసుకోవడానికి అలాగే సేల్స్ పరంగా రికార్డ్స్ బద్దలు కొట్టడానికి చాల తక్కువ ధరలో అత్యంత అధునాతనమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి తమ ఫోన్లను విడుదల చేసాయి. అయితే హువాయి బ్రాండ్ హానర్ నుంచి మీడియం రేంజ్ ధరలో వచ్చిన బడ్జెట్ ఫోన్ హానర్ 9N స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకున్న విధంగా ఏ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకోలేక పోయింది.

5-reasons-why-honor-9n-is-the-most-stylish-phone-budget-segment

5.84-inch Full HD+ displayతో పాటు 13MP+2MP డ్యూయెల్ లెన్స్ కెమెరాతో వచ్చిన ఈ హానర్ 9N స్మార్ట్ ఫోన్ రికార్డు లెవెల్ లో సేల్స్ జరిపి తన సత్తా చాటుకుంది.

5-reasons-why-honor-9n-is-the-most-stylish-phone-budget-segment

బడ్జెట్ ధరలో అత్యంత కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్..
రూ.11,999 ధరతో వచ్చిన ఈ హానర్ 9N ఫోన్ యూజర్ చేతుల్లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఈ ఫోన్ ఆఫర్ చేసే గ్రిప్ కంఫర్టబుల్ ఫీల్‌ను చేరువచేస్తుంది. ఈ ఫోన్ ప్రధానంగా గేమింగ్ ప్రియులకు నచ్చేలా డిజైన్ చేశారు. పుల్ ఐపీఎస్ LCD FullView displayతో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించింది . పుల్ వ్యూ స్క్రీన్ ద్వారా ఆకట్టుకునే రంగులో గేమ్ ఆడేవారికి టీవీ ముందు కూర్చుని ఆడుతున్న అనుభూతునిస్తుంది .

5-reasons-why-honor-9n-is-the-most-stylish-phone-budget-segment

మీ దృష్టిని ఆకర్షించే డిజైన్..
ఈ రోజుల్లో ఫోన్ అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే వాటికోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కలర్, షైనింగ్ విభాగాల్లో మంచి ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ హానర్ 9Nని సరికొత్తగా మార్కెట్లోకి విడుదల చేసింది . Midnight black, Sapphire Blue, Lavender Purple , Robin Egg Blue రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొచ్చింది .షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

5-reasons-why-honor-9n-is-the-most-stylish-phone-budget-segment

నాచ్ తో క్రిస్ప్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే..
ఈ హానర్ 9N స్మార్ట్ ఫోన్ ను 5.84-inch Full HD+ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ముందుభాగంలో ఆపిల్ ఫోన్ కి ఉండేలా నాచ్ ను ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2280 x 1080 గా ఉంది.యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడుతుంది.

5-reasons-why-honor-9n-is-the-most-stylish-phone-budget-segment

ఒక కంటి బ్లింక్ లో అన్ లాక్..
హానర్ 9N కేవలం చూడడానికే కాకుండా , ఈ ఫోన్ లో నిల్వ చేయబడిన సున్నితమైన సమాచారాన్ని కూడా జాగ్రత్తగా చూస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, పిన్ మరియు pattern లాక్ / అన్ లాక్ తో పాటు హానర్ 9N కూడా స్మార్ట్ మరియు సురక్షిత ముఖం అన్లాక్ వస్తుంది. మీరు వేగం మరియు ఖచ్చితమైన పేస్ అన్ లాకింగ్ టెక్నాలజీ సహాయంతో కేవలం ఒక చూపులో హ్యాండ్సెట్ అన్ లాక్ చేయవచ్చు. Eye comfort ఫీచర్ తో రావడం వల్ల యూజర్లు తమకు ఇష్టమైన బుక్స్ కాని వెబ్ సైట్లు కాని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు కళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తుంది. యూజర్లు కంఫర్టబుల్ అనుభవాన్ని దీని ద్వారా పొందుతారు.

5-reasons-why-honor-9n-is-the-most-stylish-phone-budget-segment

ఆకట్టుకునే ఫ్రంట్ ,డ్యుయల్ బ్యాక్ కెమెరాలు..
ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫోర్-లెన్స్ కెమెరా సిస్టం హార్డ్‌వేర్ లెవల్ bokeh ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తోంది.ఈ ఫోన్ ముందూ వెనుకా భాగాల్లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్స్, మొబైల్ ఫోటోగ్రఫీ స్టాండర్డ్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్లాయనే చెప్పొచ్చు. ఈ కెమెరాల్లో పొందుపరిచిన 2 మెగా పిక్సల్ సెకండరీ లెన్స్, హార్డ్‌వేర్-లెవల్ bokeh ఎఫెక్ట్స్‌‌కు అవసరమైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌లోని రేర్ కెమెరా యూనిట్ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌ను సపోర్ట్ చేయటంతో పాటు 1080 పిక్సల్ క్వాలిటీలో వీడియోలను కూడా రికార్డ్ చేయగలుగుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ముందు భాగం లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను ఏర్పాటు చేశారు . ఫ్రంట్ కెమెరా షూటర్స్ ద్వారా స్టన్నింగ్ పోర్ట్రెయిట్ షాట్స్‌ను యూజర్లు పొందవచ్చు. ఫ్రంట్ కెమెరాలో నిక్షిప్తం చేసిన 'పోర్ట్రెయిట్ మోడ్' అప్‌గ్రేడెడ్ బ్యూటీ అల్గారిథమ్‌తో వర్క్ అవుతుంది. స్కిన్ టోన్స్, కలర్, ఏజ్, జెండర్ ఇంక సబ్జెక్ట్స్ మధ్య తేడాలను ఈ అల్గారిథమ్‌ గుర్తించి తగిన విధంగా రిజల్ట్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
5 reasons why Honor 9N is the most stylish phone in budget segment.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X