లావా వీ5... ప్రత్యర్థులకు ముచ్చెమటలు

Written By:

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా (Lava), తాజాగా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లావా వీ5ను మార్కెట్లో విడుదల చేసింది. అటు స్పెసఫికేషన్‌ల పరంగానూ ఇటు సాఫ్ట్‌వేర్ పరంగానూ ఈ ఫోన్ మంచి మార్కులను కొట్టేసింది. రూ.11,499 ధర ట్యాగ్‌తో విడుదలైన ఈ ఫోన్ స్వల్ప తగ్గింపుతో రూ.11,299 ధర పై ట్రేడ్ అవుతోంది. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ రిటైల్ ఛానల్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. లావీ వీ5 ఫోన్‌లోని 5 ఆసక్తికర అంశాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లావీ వీ5 ఫోన్‌లోని 5 ఆసక్తికర అంశాలు..

Lava V5 ఫోన్‌కు, కెమెరా ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫోన్ వెనుక బాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా హైక్వాలిటీ ఫోటోగ్రఫీ అనుభూతులను చేరువచేస్తుంది. ఈ కెమెరాలో పొందుపరిచిన f/2.0 aperture, లార్గాన్ 5పీ లెన్స్, బ్లు గ్లాస్ ఫిల్టర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ సెన్సార్ ఫీచర్లు ఎఫెక్టివ్ ఫోటోగ్రఫీ విలువలను అందిస్తాయి. ఫోన్‌లో పొందుపరిచిన Samsung 3M2 ISOCELL సెన్సార్ కెమెరా పనితీరును మరింత రెట్టింపు చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసి 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్పీలతో పాటు బెటర్ క్వాలిటీ వీడియో కాలింగ్ను ఆస్వాదించవచ్చు. ఫోన్‌లో పొందుపరిచిన మ్యాజిక్‌పిక్స్ సాఫ్ట్‌వేర్ రకరకాల కెమెరా మోడ్స్‌ను ఆఫర్ చేస్తుంది.

 

లావీ వీ5 ఫోన్‌లోని 5 ఆసక్తికర అంశాలు..

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్‌తో కూడిన 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేను Lava V5 ఫోన్‌‌లో ఏర్పాటు చేసారు. ఈ గ్లాస్ ఫోన్ డిస్‌ప్లేను ప్రమాదాల నుంచి కాపాడుతుంది. సన్‌లైట్‌లోనూ ఈ ఫోన్ డిస్‌ప్లే ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 

లావీ వీ5 ఫోన్‌లోని 5 ఆసక్తికర అంశాలు..

Lava V5 ఫోన్‌‌లో శక్తివంతమైన 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 6753 చిప్‌సెట్‌ను నిక్షిప్తం చేసారు. ఈ చిప్‌సెట్ 64 బిట్ ప్రాసెసింగ్‌కు అనుకూలిస్తుంది. ప్రాసెసర్‌కు జతగా ఫోన్‌లో పొందుపరిచిన 3జీబి ర్యామ్ డివైస్ పనితీరును మరింత బలోపేతం చేస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమరీని, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

 

లావీ వీ5 ఫోన్‌లోని 5 ఆసక్తికర అంశాలు..

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ధి చేసిన లావా సొంత యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. త్వరలో ఆండ్రాయిడ్ 6.0 అప్‌డేట్ అందుకునే అవకాశం. ప్రీలోడెడ్ యాప్స్‌తో ఈ ఫోన్ వస్తోంది.

 

లావీ వీ5 ఫోన్‌లోని 5 ఆసక్తికర అంశాలు..

రూ.11,299 ధర ట్యాగ్‌తో లావా వీ5 ఫోన్ మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల నుంచి ఈ ఫోన్‌ను పొందవచ్చు. ఇవే తరహా స్పెక్స్‌తో లభ్యమవుతోన్న చాలా వరకు ఫోన్‌లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దొరుకుతున్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Reasons why Lava V5 has got an edge over its competitors. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot