లావా ఎక్స్81, ఎందుకంత బెస్ట్..?

లావా నుంచి తాజాగా విడుదలైన ఎక్స్81 (Lava X81) స్మార్ట్‌ఫోన్ సరికొత్త నిర్వచనానికి నాంది పలికింది. బ్యూటీ అండ్ ద బీస్ట్ కాంభినేషన్‌లో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త వార్‌కు తెరలేపింది.

 లావా ఎక్స్81, ఎందుకంత బెస్ట్..?

స్లిమ్ లుకింగ్ యునిబాడీ మెటల్ డిజైనింగ్, హైఎండ్ స్పెసిఫికేషన్స్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌ను ప్రీమియమ్ ఫోన్‌ల జాబితాలోకి చేర్చాయి. రూ.11,500 ధర ట్యాగ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతోన్న ఈ ఫీచర్ రిచ్ డివైస్ తొలి చూపులోనే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. లావా ఎక్స్81 ఫోన్‌లోని 5 ఆకట్టుకునే అంశాలను ఇప్పుడు చూద్దాం...

Read More : Incognito mode గురించి 5 వాస్తవాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటాలిక్ లుక్

లావా ఎక్స్81 ప్రత్యేకతలు..?

యునిబాడీ మెటల్ డిజైనింగ్ ఫొన్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. సిల్వర్ బ్యాకప్ ప్యానల్, కర్వుడ్ ఎడ్జెస్ ఫోన్‌కు సొగసైన లుక్‌ను తీసుకువస్తాయి. ఫోన్ సైట్ బటన్‌లను సులువుగా ఉపయోగించుకునే విధంగా డివైస్ కుడివైపు సైడ్ ప్యానల్‌లో ఏర్పాటు చేసారు. ఫోన్ ముందు భాగంలో డిస్‌ప్లేతో పాటు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇంకా మూడు కెపాసిటివ్ బటన్‌లను చూడొచ్చు.

 

బల్క్ స్పెక్స్, స్లిమ్ లుక్

లావా ఎక్స్81 ప్రత్యేకతలు..?

లావా ఎక్స్81 ఫోన్ 5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ (1280 X 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. కర్వుడ్ గ్లాస్ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ల‌ను చేరువచేస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

లావా ఎక్స్81 ప్రత్యేకతలు..?

లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ ప్యాకుడ్ స్పెసిఫికేషన్‌లను పొందుపరిచారు. 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ.

కెమెరా విషయానికొస్తే...

లావా ఎక్స్81 ప్రత్యేకతలు..?

స్లో మోషన్ వీడియో రికార్డింగ్, లాప్స్ వీడియో, బ్యూటీ ఫోకస్, పిక్ ఫోకస్ వంటి ప్రత్యేకత ఫీచర్లతో కూడిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌లో మనం చూడొచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ వీడియో కాలింగ్‌తో పాటు సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం...

లావా ఎక్స్81 ప్రత్యేకతలు..?

లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అదనంగా స్టార్ ఓఎస్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఫోన్ లో ఏర్పాటు చేసారు. అదనపు సౌకర్యాలను ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ చేరువ చేస్తుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Reasons why Lava X81 will create a lasting impression. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot