ఆ సామ్‌సంగ్ ఫోన్‌కు ఈ 5 ఫీచర్లు చాలు...

భారీ అంచనాల మధ్య సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఈ ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. కాంపిటీటివ్ ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ ఫోన్ రూ.17,000 ధర బ్రాకెట్‌లో దొరుకుతోన్న ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు పోటీనిచ్చేదిగా ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లోని 5 ప్రత్యేకమైన ఫీచర్లను మనసులను హత్తుకునే విధంగా సామ్‌సంగ్ తీర్చిదిద్దింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

f/1.7 ఫ్లాగ్‌షిప్ కెమెరా

సామ్‌సంగ్ నుంచి విడుదలయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. గెలాక్సీ ఆన్ మాక్స్ విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించిన సామ్‌సంగ్ గుడ్ క్వాలిటీ కెమెరాలను ఈ ఫోన్‌లో సెటప్ చేసింది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 ఎంపి కెమెరా f/1.7 apertureతో వస్తోండగా, ముందు భాగంలో అమర్చిన 13 ఎంపి కెమెరా f/1.7 apertureతో వస్తోంది. దీంతో తక్కువ వెళుతురులోని ఈ కెమెరాల నుంచి హైక్వాలిటీ ఫోటోలను రాబట్టే వీలుంటుంది.

సోషల్ కెమెరా మోడ్

Social Camera Mode ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ ‘షేర్ ఆన్-ద-గో' ఫీచర్ ద్వారా యూజర్లు సింగిల్ క్లిక్‌తో తమ ఫోటోలను సోషల్ మీడియా యాప్స్‌లో షేర్ చేసుకునే వీలుంటుంది. షేర్ చేసే ముందు ఫోటోలను చక్కగా ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కూడా ఈ సోషల్ కెమెరా మోడ్ కల్పిస్తుంది.

అమేజింగ్ డిస్‌ప్లే

గెలాక్సీ ఆన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్ 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ 1080x1920 పిక్సల్స్. పిక్సల్ డెన్సిటీ విషయానికి వస్తే ఒక్కో ఇంచ్‌కు 396 పిక్సల్స్. ఈ స్ర్కీన్ పై ప్లే అయ్యే ప్రతి విజువల్ చాలా షార్ప్ క్వాలిటీతో కనిపిస్తుంది. మూవీస్ అలానే గేమ్స్ ప్లే అవుతోన్న సమయంలో నేచురల్ రంగులతో కలర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌కు మీరు లోనవుతారు. సన్‌లైట్ లోనూ ఈ డిస్‌ప్లే క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో కనిపిస్తుంది. బ్రైట్నెస్‌ను పదేపదే అడ్జస్ట్ చేసుకునే పనుండదు.

సుపీరియర్ క్వాలిటీ పనితీరు

ఫోన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 2.39GHz, 1.69GHz ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌..

Samsung Pay Mini ఫీచర్, ఈ ఫోన్‌కు మరో ప్రధాన హైలైట్‌. ఈ ఫీచర్ ద్వారా నగదు చెల్లింపును మరింత సురక్షితంగా చేపట్టవచ్చు. 3300mAh బ్యాటరీ, 4జీబి ర్యామ్, ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం వంటి అత్యుత్తమ ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.16,900 మాత్రమే. ఈ ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 reasons why you should get the Samsung Galaxy On Max. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot