LYF ఫోన్‌లు కొనొచ్చా..?
తన జియో ఇన్ఫోకామ్‌తో టెలికం రంగంలో రసవత్తర పోటీకి తెరలేపిన రిలయన్స్ ఇటు 4జీ స్మార్ట్‌ఫోన్లలోనూ సరికొత్త పోటీకి తెరతీసింది.

ప్రముఖ మొబైల్ కంపెనీలకు సవాల్ విసురుతూ రిలయన్స్ లైఫ్ బ్రాండ్ పేరిట రూ.2,999కే 4G VOLTE ఫోన్‌ను అందిస్తోంది. LYF బ్రాండ్ పేరుతో రిలయన్స్ లాంచ్ చేసిన ఫోన్‌లు వివిధ మోడల్స్ లో రూ.2,999 రేంజ్ నుంచి రూ.20,000 రేంజ్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Read More : గూగుల్ Allo పై బాంబు పేల్చిన స్నోడెన్!

లైఫ్ ఫోన్‌లు ధర పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికి
ఈ ఫోన్‌ల కొనుగోలు పై రిలయన్స్ జియో సిమ్ యాక్టివేషన్‌తో పాడు డిసెంబర్ 31, 2016 వరకు అన్‌లిమిటెడ్ కాలింగ్, అన్ లిమిటెడ్ 4జీ డేటాను అందిస్తోంది. వాస్తవానికి రిలయన్స్ లైఫ్ ఫోన్‌లు ధర పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికి స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే ఇతర బ్రాండ్‌ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవల్సి ఉంది. రిలయన్స్ లైఫ్ ఫోన్‌ల పై యూజర్లు అంతగా ఆసక్తి చూపించకపోవటానికి 5 ముఖ్యమైన కారణాలు..

4G VOLTE సపోర్ట్‌తో వస్తున్నప్పటికి
రిలయన్స్ జియో ఫోన్‌లు అత్యాధునిక 4G VOLTE సపోర్ట్‌తో వస్తున్నప్పటికి, ఫోన్‌లోని మిగిలిన హార్డ్‌వేర్ మాత్రం అంత ప్రామాణికంగా లేదు. చాలా వరకు అందుబాటులో ఉన్న లైఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లో-ఎండ్ ప్రాసెసర్స్ అలానే తక్కువ సామర్ద్యం కలిగిన ర్యామ్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి.

పాత సాఫ్ట్‌వేర్
రిలయన్స్ తన లైఫ్ సిరీస్ నుంచి ఆఫర్ చేస్తున్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. కరెంటు వర్షన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow, 7.0 Nougat ఓఎస్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ లాలీపాప్ పాతది. లైఫ్ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అందకపోతే సమస్యలు తలెత్తే అవకాశముంది.

నాసిరకమైన కెమెరా
లైఫ్ సిరీస్ నుంచి వస్తున్న Wind 1, Water 1 వంటి ఫోన్‌లు నాసిరకమైన కెమెరా స్పెక్స్2తో వస్తోన్నాయి. ఇదే ధరల్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్‌లు బెటర్ క్వాలిటీ కెమెరాలతో వస్తున్నాయి.

డిజైనింగ్ విషయంలోనూ విఫలం
మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌ను శాసిస్తోన్న ఈ రోజుల్లో రిలయన్స్ ఇంకా తన లైఫ్ ఫోన్లను ప్లాస్టిక్ డిజైన్ తోను ఆఫర్ చేస్తోంది.మార్కెట్లో సరికత్త ఒరవడికి నాంది పలికన పలు చైనా బ్రాండ్లు బడ్జెట్ ధరల్లోనే మెటల్ బాడీ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి.

4జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది యూజర్లు
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ 4జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది యూజర్లు జియో లైఫ్ ఫోన్ల కంటే Xiaomi Redmi 3s, Moto E3 Power, Coolpad Note 3 Lite, Redmi Note 3, Samsung Galaxy J3 వంటి ఫోన్‌లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications