రూ.1500 జియో 4జీ ఫోన్‌లో సంచలన ఫీచర్లు..?
జియో 4జీ ఫీచర్ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఎవరూ ఊహించని విధంగా టారిఫ్ ప్లాన్‌లను లాంచ్ చేసి, టెలికం మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపిన రిలయన్స్ జియో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. తాజాగా, 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ విభాగంలోనూ జియో తన సత్తాను చాటుకుంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 20 Mbpsగా ఉంది. ముందు ముందు ఈ స్పీడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

భవిష్యత్తే లక్ష్యంగా కొత్తకొత్త సర్వీసులు..
4జీ మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్స్ విభాగంలో ఇప్పటికే 10 కోట్ల మార్కును క్రాస్ చేసిన జియో, JioFiber serviceతో బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టబోతోంది. జియో ఫైబర్ సర్వీసులకు సంబంధించి ఇప్పటికే టెస్టింగ్ ప్రాసెస్ ఇప్పటికే కొన్ని చోట్ల జరుగుతోంది. జియో చేరువచేసే ఫైబర్ సర్వీసులో భాగంగా ఇటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో పాటు అటు డీటీహెచ్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

కొత్త వివరాలు లీకయ్యాయి..
జియో లాంచ్ చేయబోతోన్న 4జీ ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి గతకొన్ని నెలలుగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 91mobiles జియో లాంచ్ చేయబోయే 4జీ ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి పలు స్పెసిషికేషన్ లను రివీల్ చేసింది.

లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం..
రూ.1700 రేంజ్‌లో అందుబాటులో ఉండే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో VoLTE సపోర్ట్ తో పాటు వై-ఫై, NFC వంటి కనెక్టువిటీ ఆప్షన్స్ ఉండబోతున్నాయి. ఈ ఆధునిక వర్షన్ ఫీచర్ ఫోన్‌లో Wi-Fi tethering supportను పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది. ఇన్ని ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెకండరీ ఫోన్ క్రింద ఉపయోగించుకోవచ్చు.

రెండు వేరియంట్‌లలో జియో 4జీ ఫీచర్ ఫోన్...
91 మొబైల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ Spreadtrum chipతో వర్క్ అవుతుంది. రెండవ వేరియంట్ Qualcomm 205 Mobile Platform పై వర్క్ అవుతుంది.

నోకియా 3310 మాదిరిగానే..
జియో 4జీ ఫీచర్ ఫోన్ కూడా 2.4 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. 2 మెగా పిక్సల్ ఫ్రంట్ అలానే 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలు ఈ ఫోన్ లో ఉండొచ్చు.

ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్...
జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో 512 ఎంబి ర్యామ్‌తో పాటు 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండొచ్చు. స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్‌ను కూడా ఏర్పాటుచేయునున్నారు.

జియో 4జీ ఫోన్‌లో యాప్స్ కూడా..?
రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ కొద్ది నెలల క్రితం ఇంటర్నెట్‌లో రివీల్ అయ్యింది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫోన్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

ధరలు ఈ విధంగా ఉండొచ్చు..
91 మొబైల్స్ ద్వారా రివీల్ అయిన వివరాల ప్రకారం Spreadtrum chipతో లాంచ్ అయ్యే జియో 4జీ ఫీచర్ ఫోన్ ధర రూ.1700గాను, Qualcomm 205 Mobile Platformతో లాంచ్ అయ్యే జియో 4జీ ఫీచర్ ఫోన్ ధర రూ.1900గాను ఉండొచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications