2018లో తుస్సుమనిపించిన 5 స్మార్ట్‌ఫోన్‌లు!

వన్‌ప్లస్, సామ్‌సంగ్, నోకియా, ఒప్పో వంటి లీడింగ్ బ్రాండ్స్ క్రియేటివిటీకి పెద్దపీట వేస్తూ స్మార్ట్‌‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

|

వన్‌ప్లస్, సామ్‌సంగ్, నోకియా, ఒప్పో వంటి లీడింగ్ బ్రాండ్స్ క్రియేటివిటీకి పెద్దపీట వేస్తూ స్మార్ట్‌‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ క్వాలిటీ పెర్ఫామెన్స్‌ను అందించగలుగుతున్నప్పటికి కొన్నికొన్ని విభాగాల్లో మాత్రం వినియోగదారుల అంచనాలను అందుకోలేక పోయాయి.భారీ అంచనాల మధ్య మార్కెట్లో లాంచ్ అయి తుస్సుమనిపించిన 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడుత తెలుసుకుందాం..

2018లో లాంచ్ అయిన బెస్ట్ టాబ్లెట్స్ : ఆపిల్, అమెజాన్, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్2018లో లాంచ్ అయిన బెస్ట్ టాబ్లెట్స్ : ఆపిల్, అమెజాన్, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ అండ్ ఎక్స్ఆర్ (Apple iPhone XS/XS Max and XR)

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ అండ్ ఎక్స్ఆర్ (Apple iPhone XS/XS Max and XR)

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతకంతకు తన పట్టును కోల్పోతోన్న యాపిల్ 2018ని మరింత సీరియస్‌గా తీసుకుంది. ఈ బ్రాండ్ నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ అండ్ ఎక్స్ఆర్ స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు పరంగా కాస్తంత మెరుగనిపించాయి. అయితే వీటి కంటే తక్కువ బడ్జెట్‌లలో గెలాక్సీ నోట్ 9, గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్, హువావే మేట్ 20 ప్రో వంటి ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో యూజర్లకు వీటికే ఎక్కువుగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఏదేమైనప్పటికి మీరు ఆపిల్ అభిమాని అయినట్లయితే ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ అండ్ ఎక్స్ఆర్ మోడల్స్ మీకు బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 (Samsung Galaxy A9)
 

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 (Samsung Galaxy A9)

2018కిగాను స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చటుచేసుకున్న విప్లవాత్మక ఆవిష్కరణల్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ఒకటి. ఈ ఫోన్ వెనుక భాగంలో ఏకంగా నాలుగు కెమెరాలను సామ్‌సంగ్ ఎక్విప్ చేసింది. ఈ నాలుగు కెమెరాలు వేరువేరు సెన్సార్లను కలిగి ఉంటాయి.ఈ కెమెరాలు ఒకే ఆర్డర్‌లో ప్లేస్ అయి ఉంటాయి. అల్ట్రావైడ్, టెలీఫోటో, మెయిన్ ఇంకా డెప్త్ సెన్సార్లను ఈ నాలుగు కెమెరాలలో సామ్‌సంగ్ నిక్షిప్తం చేసింది. వీటిలో అల్ట్రావైడ్ లెన్స్ మరిన్ని అబెక్ట్స్‌ను ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చి వాటిని క్యాప్చుర్ చేయగలుగుతుందని సామ్‌సంగ్ చెబుతోంది. పానోరమా షాట్స్‌ను చిత్రీకరించే సమయంలో అల్ట్రావైడ్ లెన్స్ ఫ్రేమ్‌ను మరింత డిటెయిల్డ్‌గా అందించ గలుగుతుందట. రూ.35,000 బడ్జెట్‌లో ఈ ఫోన్ ఓకే అనిపించినప్పటికి కెమెరా ఎండ్ - రిజల్ట్స్ మాత్రం సంతృప్తికరంగా లేవు.

వన్‌ప్లస్ 6 (OnePlus 6)

వన్‌ప్లస్ 6 (OnePlus 6)

ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్ 6 (OnePlus 6) ఒకటి. భారీ అంచనాల మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మల్టీటాస్కింగ్, కంప్యూటింగ్, గేమింగ్ ఇంకా ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా బెస్ట్ క్లాస్ పెర్ఫామెన్స్ ను ఆఫర్ చేస్తున్నప్పటికి కెమెరా విషయంలో మాత్రం చతికిలబడింది. ఇదే సమయంలో ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీకి సంబంధించిన ఐపీ రేటింగ్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేయలేక పోయింది.

నోకియా 7 ప్లస్ (Nokia 7 Plus)

నోకియా 7 ప్లస్ (Nokia 7 Plus)

హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో నోకియా 7 ప్లస్ ఒకటి. సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్రిస్ప్ క్వాలిటీ 18:9 డిస్‌ప్లేతో పాటు మంచి బ్యాటరీ, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్, స్నాప్‌డ్రాగన్ 660 సీపీయూ వంటి శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికి కెమెరా పనితీరు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతోంది. ముఖ్యంగా తక్కువ వెళుతురు కండీషన్స్‌లో ఫోటోలను క్యాప్చుర్ చేసేటపుడు క్వాలిటీ పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి.

 

 

ఒప్పో ఫైండ్ ఎక్స్ (OPPO Find X)

ఒప్పో ఫైండ్ ఎక్స్ (OPPO Find X)

ఒప్పో బ్రాండ్ నుంచి ఈ ఏడాదికిగాను ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో ఫైండ్ ఎక్స్ (OPPO Find X) సెక్సియస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ డివైస్ ఇన్నోవేటివ్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికి యూజర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నిరుత్సహాపరిచిందనే చెప్పాలి. ఈ ఫోన్‌తో అందించిన కలర్‌ఓఎస్ స్కిన్ ఫోన్ డిజైన్‌తో సింక్ అవ్వకపోవటం విశేషం.

Best Mobiles in India

English summary
5 Smartphone we think could have been better in the year 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X