ఆ ఐదు ఫీచర్లతో జియో 4జీ ఫోన్, పెను సంచలనమే

ప్రపంచమంతా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎదురుచూస్తోంటే, మన ఇండియా మాత్రం ఓ విప్లవాత్మక ఫీచర్ ఫోన్ కోసం ఎదురుచూస్తోంది.అదే రిలయన్స్ ప్రవేశపెట్టబోతోన్న జియో 4జీ ఫీచర్ ఫోన్. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రెండు వేరియంట్‌లలో 4జీ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌లకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4G VoLTE సపోర్ట్ ప్రధాన హైలైట్‌..

రూ.500 నుంచి రూ.1500 రేంజ్‌లో అందుబాటులో ఉంటాయని భావిస్తోన్న ఈ ఫీచర్ ఫోన్‌లకు 4G VoLTE సపోర్ట్ ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. 2జీ నెట్‌వర్క్‌ను తుడిచిపెట్టేసే లక్ష్యంతో రాబోతోన్న జియో 4జీ వోల్ట్ ఫోన్‌లు 5 విప్లవాత్మక ఫీచర్లను ఫీచర్ ఫోన్ యూజర్లకు పరిచయం చేయబోతున్నట్లు సమచారం.

ఇంటర్నెట్ షేరింగ్...

రిలయన్స్ లాంచ్ చేయబోతోన్న జియో 4జీ ఫీచర్ ఫోన్ వై-ఫై హాట్ స్పాట్ ఫీచర్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌తో వచ్చే ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను వేరొక డివైస్‌కు షేర్ చేసుకునే వీలుంటుంది. జియో 4జీ ఫీచర్ ఫోన్ వై-ఫై హాట్ స్పాట్ ఫీచర్‌తో రాబోతోందన్న రూమర్ విస్తృతంగా ప్రచారమవుతోన్న నేపథ్యంలో జియో 4జీ ఫోన్‌ను సెకండరీ ఫోన్‌గా ఉపయోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు.

512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌...

జియో 4జీ ఫీచర్ ఫోన్ గురించి కొన్ని వెబ్‌సైట్‌లు రాసుకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. ఫీచర్ ఫోన్‌లలో ఈ తరహా స్టోరేజ్ అనేది అతిభారీగా చెప్పుకోవచ్చు. అదనంగా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయాన్ని కూడా ఈ డివైస్‌లో కల్పించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్

వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం జియో 4జీ ఫీచర్ ఫోన్ ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్ టూల్‌తో రాబోతోంది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ద్వారా బేసిక్ ఫోన్‌లలోనూ మొబైల్ ఆపరేటింగ్ అనేది చాలా సులభతరంగా మారిపోతోంది.

LYF లోగోతో...

తాజాగా టెక్‌పీపీ అనే వెబ్‌సైట్ రిలయన్స్ 4G VoLTE ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి లైవ్ పిక్షర్స్‌ను లీక్ చేసింది. LYF లోగోతో కనిపిస్తోన్న ఈ ఫీచర్ ఫోన్ 2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే, డ్యుయల్ లాంగ్వేజ్ కీప్యాడ్, నేవిగేషన్ బటన్లను కలిగి ఉంది. టార్చ్ లైట్‌ను ఆపరేట్ చేసేుకునేందుకు ప్రత్యేకమైన బటన్‌ను ఈ ఫోన్ కలిగి ఉండటం విశేషం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Stand Out Rumoured Specifications of Reliance Jio 4G Feature Phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot