షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

Written By:

షియోమీ రెడ్మీ నోట్ 3కి పోటీగా లెనోవో తన వైబ్ కే5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.8,499. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 23 నుంచి ఓపెన్ సేల్ పై విక్రయించబోతోంది. ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను పరిశీలించినట్లయితే..

షియోమీ రెడ్మీ నోట్ 3  vs లెనోవో వైబ్ కే5 ప్లస్

Read More : చైనాలో అదృశ్య మనిషి కలకలం!

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

షియోమీ రెడ్మీ నోట్ 3  vs లెనోవో వైబ్ కే5 ప్లస్

Read More : కొరియా అధ్యక్షుడి ఫోన్ మిస్టరీ వెనుక రహస్యం ఏమిటి..?

వైబ్ కే5 ప్లస్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో షిప్ కాబోతోంది. ఈ డ్యుయల్ సిమ్ డివైస్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను లెనోవో నిక్షిప్తం చేసింది. 4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. డాల్బీ అటామస్ ఫీచర్ తో వస్తోన్న ఈ ఫోన్ లో 2,750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఏర్పాటు చేసారు.

షియోమీ రెడ్మీ నోట్ 3  vs లెనోవో వైబ్ కే5 ప్లస్

Read More : చరిత్రలో అతి పెద్ద హ్యాకింగ్ : ఒక్క పదం మార్చి రూ. 673 కోట్లు దోపిడీ

మరోవైపు, షియోమీ రెడ్మీ నోట్ 3, రూ.9,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో లభ్యమవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా షియోమీ రెడ్మీ నోట్ 3 అలానే లెనోవో వైబ్ కే5 ప్లస్‌ల మధ్య స్పెసిఫికేషన్‌ల వ్యత్యాసాలను విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

షియోమీ రెడ్మీ నోట్ 3, పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. 164 గ్రాములు బరువుండే ఈ ఫోన్ ప్రీమియమ్ లుక్‌ను కలిగిస్తుంది. అయితే ఈ ఫోన్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కరువయ్యింది.

ఇక, లెనోవో వైబ్ కే5 ప్లస్ విషయానికొస్తే.. అల్యుమినియమ్ కేసింగ్‌తో కూడిన బ్యాక్ అలానే స్ర్కాచ్ రెసిస్టెండ్ డిస్‌ప్లేతో కూడిన ఫోన్ ఫ్రంట్ భాగాలు ఆకట్టుకుంటాయి. హ్యాండ్‌సెట్ బరువు 142 గ్రాములు. మందం 7.9 మిల్లీమీటర్లు.

 

షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

లెనోవో వైబ్ కే5 ప్లస్ 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 441 పీపీఐతో కూడిన 1920 x 1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీ.

షియోమీ రెడ్మీ నోట్ 3 విషయానికొచ్చే సరికి, ఈ హ్యాండ్ సెట్ 403 పీపీఐ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే‌తో వస్తోంది. ఈ ఫోన్ లో పొందుపరిచిన సన్‌లైట్ డిస్‌ప్లే ఫీచర్ వెళుతురుకు అనుగుణంగా కాంట్రాస్ట్‌ను పెంచుతుంటుంది.

 

షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

లెనోవో వైబ్ కే5 ప్లస్‌లో 2జీబి ర్యామ్ సపోర్ట్‌తో కూడిన 1.7గిగాహెర్ట్జ్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 616 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసారు. అడ్రినో 405 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ను లీడ్ చేస్తుంది.

ఇక షియోమీ రెడ్మీ నోట్ 3 విషయానికొచ్చే సరికి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 హెక్సా కోర్ సాక్‌ను డివైస్‌లో ఏర్పాటు చేసారు. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్ విత్ 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్ విత్ 32జీబి ఇంటర్నల్ మెమరీ. ఈ రెండు వేరియంట్‌లలోనూ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసారు. ఈ సౌలభ్యతతో ఫోన్ మెమరీని 128జీబి విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

 

షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

లెనోవో వైబ్ కే5 ప్లస్.,. 13 మెగా పిక్సల్ రేర్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, Omnivision OV13850 సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

ఇక షియోమీ రెడ్మీ నోట్ 3 విషయానికొచ్చే సరికి... 13 మెగా పిక్సల్ రేర్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఫోన్ ముందు, వెనుక భాగాల్లో నిక్షిప్తం చేసారు. డ్యుయల్ టోన్ ఫ్లాష్, వైడ్ ఎఫ్ 2.0 అపెర్చుర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వీడియోస్ వంటి ప్రత్యేకతలను ఈ కెమెరాల్లో పొందుపరిచారు.

 

షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

షియోమీ రెడ్మీ నోట్ 3, 4050 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. అదనంగా ఈ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జింగ్ ఫీచర్ ను సపోర్ట్ చేస్తుంది. మరోవైపు లెనోవో వైబ్ కే5 ప్లస్ 2750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు.

 

షియోమీ రెడ్మీ నోట్ 3 vs లెనోవో వైబ్ కే5 ప్లస్

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి స్పెక్స్ అలానే ధరలను పరిశీలించిన తరువాత వైబ్ కే5 ప్లస్‌తో పోలిస్తే రెడ్మీ నోట్ 3 బెటర్ ఛాయిస్ అనిపిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Surprising Reasons Why You'll End up Buying Xiaomi Redmi Note 3 instead of Lenovo Vibe K5 Plus! Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot