2019లో మార్కెట్ ను షేక్ చేయడానికి రాబోతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేగం పుంజుకున్నప్పటి నుంచి వీటి విపరీతం చాలా బాగా పెరిగిపోయింది. అదీ కాక టెలికాం దిగ్గజాలు డేటా ఆఫర్లను అత్యంత తక్కువ ధరలకే అందించడం కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు.అయితే మార్కెట్లో రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికి కారణం కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ మూలకు పడేయడం. ఈ నేపధ్యంలో అలాంటి వారి కోసం వచ్చే ఏడాది బెస్ట్ ఫీచర్లతో రాబోతున్న కొన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లను ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

New Apple iPhones
టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ వచ్చే ఏడాది సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది.వచ్చే ఏడాది ఈ కంపెనీ నుంచి బెటర్ కెమెరాతో నాచ్-లెస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తునట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

Samsung Galaxy S10, S10 Plus
శాంసంగ్ నుంచి వచ్చే ప్రతి ఆవిష్కరణలో ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది అందులో భాగంగానే 2019లో శాంసంగ్ కంపెనీ Samsung Galaxy S10, S10 Plus ను మార్కెట్లోకి విడుదల చేయబోతుంది.

New OnePlus smartphones
ఇప్పటివరకైతే వన్‌ప్లస్ సంస్థ ఫస్ట్ హాల్ఫ్ లో విడుదల చేయబోతున్న ఫోన్ల పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే వన్‌ప్లస్ నుంచి 5జి స్మార్ట్ ఫోన్ రాబోతుంది అని తెలుస్తుంది

Nokia 9
హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఈ ఏడాది మార్కెట్లో 12 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసి తన సత్తా ఏంటో చాటుకుంది. అదే మాదిరిగా వచ్చే ఏడాది కూడా మరిన్ని ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తునట్టు తెలుస్తుంది.అయితే వాక్కుగె ఏడాది నోకియా నుంచి మొదటి రాబోయే ఫోన్ మాత్రం Nokia 9 అని తెలుస్తుంది.

Xiaomi Redmi Pro 2
ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్నXiaomi Redmi Pro 2 ఫీచర్లు రోజుకొకకటి లీకవుతూ సంచలనం రేపుతున్నాయి. గతంలో వచ్చిన రెడ్‌మి ప్రోతో సంచలనం సృష్టించిన షియోమి Redmi Pro 2 తో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ను 48 మెగాపిక్సెల్ తో తీసుకురానున్నట్లు లీకయిన రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

Google Pixel smartphones
గూగుల్ వచ్చే ఏడాది కొత్త సిరీస్ లో పిక్సెల్ ఫోన్లను విడుదల చేస్తునట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








