సామ్‌సంగ్ యాపిల్‌ను కాపీ కొట్టిందా.?

Posted By:

స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో రెండు కంపెనీల మధ్య వైరం భీకర స్థాయికి చేరుకుంది. స్మార్ట్‌ఫోన్ నిర్మాణ విభాగంలో యాపిల్, సామ్‌సంగ్‌లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఆధునిక స్మార్ట్‌ఫోన్ విప్లవానికి తెర లేపిన యాపిల్‌ను సామ్‌సంగ్ చాలా కొద్దికాలంలోనే అధిగమించే స్థాయికి ఎదిగింది.

ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ ఎదుగుదల పై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాపిల్ ఆలోచనలను గత కొద్ది సంవత్సరాలుగా సామ్‌సంగ్ కాపీ కొడుతుందని పలువురు అభిప్రాయపడుతుండగా మరి కొందరు మాత్రం చవక ధరల్లో ఆధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయటం కారణంగానే సామ్‌సంగ్ నెం.1గా నిలిచిందని అంటున్నారు. ఏదేమైనప్పటికి యాపిల్ ఐడియాలను సామ్‌సంగ్ కాపీ కొట్టిందనటానికి పలు ఆసక్తికర వాస్తవాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ యాపిల్‌ను కాపీ కొట్టిందా.?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2లో ఏర్పాటు వాయిస్ రికార్డర్ అప్లికేషన్, ఐఫోన్‌లో నిక్షిప్తం చేసిన వాయిస్ రికార్డర్ అప్లికేషన్‌ను పోలి ఉండటాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.

సామ్‌సంగ్ యాపిల్‌ను కాపీ కొట్టిందా.?

సామ్‌సంగ్ మొట్టమొదటి గెలాక్సీ ట్యాబ్లెట్ ఛార్జర్ పోర్టులు ఒక మోడల్ ఐప్యాడ్‌ను పోలి ఉండటాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.

సామ్‌సంగ్ యాపిల్‌ను కాపీ కొట్టిందా.?

ఈ చిత్రంలో మీరు చూస్తున్న సామ్‌సంగ్ పాత మోడల్ యూఎస్బీ ఛార్జింగ్ బ్రిక్ పక్కనే ఉన్న యూపిల్ యూఎస్బీ బ్రిక్ ఛాయలను కలిగి ఉండటాన్ని గమనించవచ్చు.

సామ్‌సంగ్ యాపిల్‌ను కాపీ కొట్టిందా.?

యాపిల్ ఐప్యాడ్ ప్యాకింగ్ తరహాలోనే సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ప్యాకింగ్.

సామ్‌సంగ్ యాపిల్‌ను కాపీ కొట్టిందా.?

ఫోన్ డైలర్ ఇంకా నోట్ ప్యాడ్ అప్లికేషన్‌లకు సంబంధించి యాపిల్ ఉపయోగించిన ఐకాన్‌లోనే సామ్‌సంగ్ తన స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిందనటానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot