ఆండ్రాయిడ్ కంటే విండోస్ ఫోనే బెస్ట్!

Written By:

స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌ల తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంకా అనౌన్స్‌మెంట్స్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్‌లు మార్కెట్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తుండగా విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.

 ఆండ్రాయిడ్ కంటే విండోస్ ఫోనే బెస్ట్!

అభివృద్థి చెందుతోన్న దేశాల్లో మైక్రోసాఫ్ట్ ఫోన్‌ల వినియోగం ఆశాజనకంగానే ఉన్నప్పటికి అమ్మకాల పరంగా మరింత వృద్థి సాధించాల్సి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే విండోస్ పోన్‌లు బెస్ట్ యూసేజ్ క్వాలిటీని కలిగి ఉన్నాయనటానికి పలు వాస్తవాలను ఇక్కడ ప్రస్తావించటం జరుగుతోంది...

Read More : నెలకు రూ.495 చెల్లిస్తే ఆ సామ్‌సంగ్ ఫోన్‌ మీదే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ కంటే విండోసే బెస్ట్!

విండోస్ ఫోన్ సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. డివైస్‌లోని యాప్స్ రెప్పపాటులో లోడైపోతాయి. ఫోన్ అరుదుగా హ్యాంగ్ అవటాన్ని మనం చూడొచ్చు.

 

ఆండ్రాయిడ్ కంటే విండోసే బెస్ట్!

విండోస్ ఫోన్‌లు సింగిల్ ఛార్జ్ పై 13 నుంచి 14 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలవు. హెవీ యూజర్లకు 10 గంటల బ్యాకప్‌ను కచ్చితంగా పొందవచ్చు.

 

ఆండ్రాయిడ్ కంటే విండోసే బెస్ట్!

విండోస్ ఫోన్‌లను తొలత నోకియా ప్రపంచానికి పరిచయం చేసింది. నిర్మాణ పరంగా మైక్రోసాఫ్ట్ అందించే విండోస్ ఫోన్ డివైస్‌లు చాలా ధృఢంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలను ఈ ఫోన్‌లు ఏ మాత్రం లెక్క చేయవు.

 

ఆండ్రాయిడ్ కంటే విండోసే బెస్ట్!

మైక్రోసాఫ్ట్ నుంచి లుమియా ఫోన్‌లు స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ రూపురేఖలనే మార్చేసాయి. ఈ ఫోన్ కెమెరాలు అందించిన ప్రొఫెషనల్ లెవల్ ఫోటోగ్రాఫ్స్ విండోస్ ఫోన్‌లకు మంచి పేరును తీసుకువచ్చాయి. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన లుమియా డివైస్‌లలో అనేక కెమెరా కంట్రోల్స్‌ను మనం చూడొచ్చు.

 

ఆండ్రాయిడ్ కంటే విండోసే బెస్ట్!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే విండోస్ ఫోన్‌లను కంఫర్ట్‌గా ఫీలయ్యే యూజర్లు చాలా మందే ఉన్నారు. విండోస్ ఫోన్‌లు అందించే స్వైప్ కీబోర్డ్స్, కస్టమైజబుల్ యాక్షన్ సెంటర్, లాక్ స్ర్ర్కీన్ ఆప్షన్స్, గ్లాస్ స్ర్కీన్ టెక్నాలజీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 ways Windows Phone is definitely more useful than an Android smartphone!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot