త్వరలో విడుదల కాబోతున్న 5 అత్యుత్తమ విండోస్ ఫోన్‌లు

Posted By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 8 పేరుతో 2012 అక్టోబర్ 29న విడుదల చేసిన సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య ఆదరణ లిభిస్తోంది. డైనమిక్ లైవ్‌టైల్ సమాచార వ్యవస్థ, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, విజువల్ వాయిస్ మెయిల్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ వోఎస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, సామ్‌సంగ్, హెచ్‌టీసీలు ఈ కొత్త వోఎస్‌తో కూడిన సరికొత్త వర్షన్ స్మార్ట్‌‍ఫోన్‌లను మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013కుగాను అత్యుత్తమ ఫీచర్లతో విడుదల కాబోతున్న టాప్-5 విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌‍ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.) HTC Tiara (హెచ్‌టీసీ టియారా):

1.) HTC Tiara (హెచ్‌టీసీ టియారా):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ సీపీయూ,
4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

 

హువాయి ఆసెండ్ డబ్ల్యూక్యూ 5 (Huawei Ascend WQ 5)

2.) హువాయి ఆసెండ్ డబ్ల్యూక్యూ 5 (Huawei Ascend WQ 5):

వాటర్ ప్రూఫ్ డిజైన్,
విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ కెమెరా.

 

నోకియా ఈఓఎస్ (Nokia EOS):

3.) నోకియా ఈఓఎస్ (Nokia EOS):

41 మెగా పిక్సల్ కెమెరా,
విండోస్ ఫోన్ 8 జీడీఆర్ 2 ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్ఎమ్ రేడియో.

 

సామ్‌సంగ్ క్రోనస్ (Samsung Cronus):

4.) సామ్‌సంగ్ క్రోనస్ (Samsung Cronus):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ఎల్‌టీఈ కనెక్టువిటీ,ఇతర ఫీచర్లు తెలయాల్సి ఉంది.

 

 

నోకియ క్యాట్‌వాక్ ( Nokia Catwalk):

5.) నోకియ క్యాట్‌వాక్ ( Nokia Catwalk):

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (1.5గిగాహెట్జ్ క్లాక్ వేగం),
వోక్టా ఎల్ఈడి 4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 × 768పిక్సల్స్),
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఫోన్ బరువు 132 గ్రాములు,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting