50,000 ఫోన్‌లు.. 5 నిమిషాల్లు ఊదేసారు!

Posted By:

మైక్రోమాక్స్ తన కాన్వాస్ స్పార్క్ (Canvas Spark) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద గురువారం నిర్వహించిన రెండవ ఫ్లాష్‌సేల్‌లో భాగంగా 5 నిమిషాల్లో 50,000 ఫోన్‌లు అమ్ముడైనట్లు మైక్రోమాక్స్ తెలిపింది. మొదటి ఫ్లాష్‌ సేల్‌లో అందుబాటులో ఉంచిన 20,000 యూనిట్లు కేవలం రెండు నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయాయని మైక్రోమాక్స్ తెలిపింది. ఈ ఫోన్ మూడవ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు స్నాప్‌డీల్ వద్ద ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

 50,000 ఫోన్‌లు.. 5 నిమిషాల్లు ఊదేసారు!

షియోమీ రెడ్మీ 2కు పోటీగా మైక్రోమాక్స్ రూ.4,999 ధర శ్రేణిలో ‘కాన్వాస్ స్పార్క్' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ డివైస్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..

 50,000 ఫోన్‌లు.. 5 నిమిషాల్లు ఊదేసారు!

4.7 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీకే6582 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 3జీ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ జీపీఎస్.

English summary
50,000 Micromax Canvas Spark units go out of stock in less than 5 minutes on Snapdeal. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot