ఒక్క రోజులో 60 లక్షల జియోఫోన్‌లను బుక్ చేసారు

రిలయన్స్ జియోఫోన్‌లకు సంబంధించి తాజా న్యూస్ ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. జియోఫోన్‌ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమైన తరువాత దాని మాతృసంస్థ అయిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌కు ఒక్కరోజులో 60 లక్షల బుకింగ్స్ అందాయని తెలుస్తోంది. జియోఫోన్‌లకు సంబంధించి ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో బుకింగ్స్ అందాయని చెబుతోన్నజియో స్పష్టమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.

Read More : ప్రీ-ఆర్డర్ పై Redmi 4A..ఇప్పుడు 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్‌తో లభ్యం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కోటి మంది యూజర్లు ఆసక్తికనబరిచారు..

వారానాకి 50 లక్షల జియో ఫోన్‌లను విక్రయించాలన్నది జియో టార్గెట్ కాగా, ప్రస్తుత డిమాండ్‌ను బట్టి చూస్తుంటే ఆ సంఖ్యను మరింత పెంచాల్సి ఉందని స్పష్టమవుతోంది. అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం జియోఫోన్ బుకింగ్స్‌ను నిలిపివేసేనాటికి దాదాపుగా కోటి మంది యూజర్లు JioPhoneలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

ఊహించని స్థాయిలో డిమాండ్

జియోఫోన్‌లకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకునటంతో ప్రీ-బుకింగ్స్‌ ప్రక్రియను జియో తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. మొదిటి బ్యాచ్ జియోఫోన్‌లకు సంబంధించి షిప్పింగ్ ప్రాసెస్ మొదలైన తరువాతనే మళ్లీ ఈ బుకింగ్ ప్రాసెస్ మొదలయ్యే అవకాశం ఉంది. సెప్టంబర్ మొదటి వారంలో జియోపోన్ మొదటి బ్యాచ్ ఫోన్ లు డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గేమ్ ఛేంజర్‌..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న రిలయన్స్ జియోఫోన్ ఒకదెబ్బతో ఫీచర్ ఫోన్‌ల స్వరూపాన్నే మార్చేసింది. 50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లాంచ్ చేసిన జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌ మొత్తాన్నితనవైపుకు తిప్పుకున్నట్లయ్యింది. 4జీ VoLTE కనెక్టువిటీకి తోడకు స్మార్ట్‌ఫోన్ తరహా ప్రత్యేకతలతో రూపుదిద్దికున్న జియోఫోన్‌ ఉచితంగా దొరుకుతుందంటే ఎవరు వద్దంటారు చెప్పండి!.

ప్రతి ఒక్కరికి ఉచితం..

జియోఫోన్‌ ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు. ఫోన్ బుకింగ్ సమయంలో రూ.500. డెలివరీ సమయంలో రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ ఛానల్స్ ద్వారా

ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ ఛానల్స్ ద్వారా ఈ ఫోన్ లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ ఫోన్‌లను బుక్ చేసుకోవాలనుకునే వారు MyJio app లేదా కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

మైజియో యాప్ ద్వారా

మైజియో యాప్ ద్వారా జియోఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవాలను కుంటున్నట్లయితే ముందుగా యాప్‌ను ఓపెన్ చేయండి. వెంటనే మీకు ప్రీ బుకింగ్ స్ర్కీన్ కనిపిస్తుంది. ప్రీ-బటన్ పై క్లిక్ చేసినట్లయితే తరువాతి పేజీలోకి వెళతారు. అక్కడ మీ మొబైల్ నెంబర్‌తో పాటు మీ అడ్రస్ ఇంకా పిన్‌కోడ్ వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే పేమెంట్ చేసేందుకు మల్టిపుల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరమైన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని రూ.500 పేమెంట్ పూర్తి చేసినట్లయితే బుకింగ్ విజయవంతమవుతుంది.

బుకింగ్ స్టేటస్ తెలుసుకోవాలంటే..?

జియో ఫోన్‌లను ఇప్పటికే ప్రీ-బుక్ చేసుకున్న వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 18008908900కు డయల్ చేసి తమ వివరాలను తెలపటం ద్వారా బుకింగ్ స్టేటస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ తెలుస్తాయి. ప్రస్తుతానికి ఈ నెంబర్ హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. జియో కస్టమర్లు మైజియో యాప్ ద్వారా ఫోన్ బుకింగ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

రూ.153 బేస్ ప్లాన్‌

జియోఫోన్ యూజర్లు కోసం రూ.153 బేస్ ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. జియోఫోన్ యూజర్లు నెలకు రూ.153 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఈ ఫోన్‌తో ఇన్‌‌బిల్ట్‌గా వస్తోన్న జియో యాప్స్ ద్వారా మ్యూజిక్, సినిమా, లైవ్ టీవీ ఇలా అనేక సదుపాయాలను ఆస్వాదించే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 million JioPhones booked in one day: A new record for Reliance Retail Limited. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot