డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

|

కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు గిరాకీ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రొఫెషనల్ డిజిటల్ కెమెరాలకు జనాదరణ తగ్గుతోంది. ఇందుకు కారణం డిజిటల్ కెమెరాల కల్పించలేని సౌకర్యాలు స్మార్ట్‌ఫోన్‌లు కల్పించటమే. DSLR కెమెరాతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ బెస్ట్ అనటానికి 6 ఆసక్తికర కారణాలను మీముందు ఉంచుతున్నాం...

Read More : Android Nougat ప్రత్యేకతలేంటి..?

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

గుడ్ క్వాలిటీ కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌ను అన్ని వేళలా మీతో తీసుకువెళ్లవచ్చు. ఇదే సమయంలో బల్కీ కెమెరాలను క్యారీ చేయటం కదరదు. డిజిటల్ కెమెరాలను మోసుకెళ్లేందుకు ప్రత్యేకమైన బ్యాగ్ అవసరమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ఇలాంటివేవి ఉండవు. సింపుల్ గా మీ జేబులో పెట్టేసుకోవచ్చు.

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

ఏకాగ్రతతో తీయాల్సి వచ్చే కొన్ని కఠినమైన షాట్‌లకు డీఎస్ఎల్ కెమెరాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ చాలా హ్యాండీగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశాల్లో డీఎస్ఎల్ కెమెరాతో సాధ్యంకాని ఫోటో షూట్‌ను స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో చేపట్టవచ్చు.

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!
 
డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

Android, iOS వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలు తమ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం రకరకాల ఫోటో సెంట్రిక్ యాప్స్‌ను అందిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో ఫోటోలను అత్యుత్తమ ఎడిట్ చేసుకోవటంతో పాటు అదనపు యానిమేషన్‌లను యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ కెమెరాలలో ఈ సౌకర్యాలు తక్కువ.

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

స్మార్ట్‌ఫోన్ కెమెరాలను ప్రొఫెషనల్ కెమెరాలుగా తీర్చిదిద్దే అనేక ఉపకరణాలు మార్కెట్లో సిద్దంగా ఉన్నాయి. వీటిని అవసరమైనపుడు ఫోన్ కెమెరాకు ఫిట్ చేసుకుని ప్రొఫెషనల్ స్థాయిలో అనుభూతులతో ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

డిజిటల్ కెమెరాలతో పోలిస్తే స్మార్ట్‌పోన్ కెమెరాలు నిరంతరం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. స్మార్ట్‌పోన్ కెమెరాతో షూట్ చేసే ఫోటోలను సెకన్ల వ్యవధిలో షేర్ చేయవచ్చు. అన్నిడిజిటల్ కెమెరాలతో ఇది సాధ్యం కాదు.

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

ఫోటోగ్రఫీ రంగంలో పట్టు సాధించాలనుకునే వారికి స్మార్ట్‌పోన్ ఫోటోగ్రఫీ చక్కటి ప్రాక్టీస్. స్మార్ట్‌పోన్ ఫోటోగ్రఫీతో రకరకాల ప్రయోగాలను చేయవచ్చు.

Best Mobiles in India

English summary
6 Ways Smartphone Cameras Prove Better than Digital Cameras. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X