మీకు ఎప్పటికైనా ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్ ట్రిక్స్

స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి.

|

ఆండ్రాయడ్ ఫోన్‌లను వాడుతోన్న ప్రతి ఒక్కరికి తమ డివైస్ గురించి అనేక సందేహాలు, సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని పరిష్కరించుకునే క్రమంలో టిప్స్ ఇంకా ట్రిక్స్ కోసం ఇంటర్నెట్‌లో వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసం పలు ముఖ్యమైన స్మార్ట్ ట్రిక్స్‌ను ఇక్కడ సూచించటం జరుగుతోంది. వీటిని తెలుసుకుకోవటం వల్ల ఫోన్‌కు సంబంధించి కొన్ని సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు...

Read More : రూ.299కే నెలంతా ఉచిత కాల్స్, 1జీబి 4జీ ఇంటర్నెట్!

నిదానించటానికి చాలా కారణాలు..

నిదానించటానికి చాలా కారణాలు..

స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి... ఫోన్‌లో పేరుకుపోయిన పనికిరాని యాప్స్ ఇంకా విడ్జెట్స్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని నిమిషాల్లో పెంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

క్యాచీ ఫైల్స్ క్లియర్ చేసుకోండి..

క్యాచీ ఫైల్స్ క్లియర్ చేసుకోండి..

ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ క్లియర్ చేయటం దినచర్యగా అలవాటు చేసుకోండి. క్యాచీ ఫైల్స్ అనేవి ఇంటర్నెట్ బ్రౌజర్స్ అలానే యాప్స్ కారణంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఫోన్‌లో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ మాత్రమే ఉండేలా చూసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే..
 

ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే..

సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్లికేషన్ మేనేజర్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఒక్కో యాప్ పై క్లిక్ చేసినట్లయితే ఆ యాప్‌కు సంబంధించిన క్యాచీ మెమరీ కనిపిస్తుంది. క్లియర్ క్యాచీ ఆప్షన్‌ను సెలక్ట్ చేయటం ద్వారా సదరు యాప్‌కు సంబంధించిన క్యాచీ ఫైల్స్ తొలిగించబడతాయి.

పనికిరాని యాప్స్ తొలగించటం ద్వారా..?

పనికిరాని యాప్స్ తొలగించటం ద్వారా..?

ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను తొలగించిటం ద్వారా ఫోన్ వేగాన్ని నిమిషాల వ్యవధిలో పెంచుకోవచ్చు.

విడ్జెట్స్‌ను తొలగించటం ద్వారా..?

విడ్జెట్స్‌ను తొలగించటం ద్వారా..?

హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకున్న విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ర్యామ్ పై ఏర్పడిన ఒత్తిడి తగ్గి పనితీరు పెరిగే అవకాశముంది.

ల్యాపీలోని ఫైల్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి..

ల్యాపీలోని ఫైల్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి..

ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫైళ్లను స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నట్లయితే.. ముందుగా మీ ల్యాప్‌టాప్‌ను యూఎస్బీ కేబుల్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయండి. తరువాతి చర్యగా డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆన్ చేయండి. ఇప్పుడు ల్యాపీ డెస్క్‌టాప్ లైదా హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న ఫైళ్లను ఓ ప్రత్యేక ఫోల్డర్‌లోకి కాపీ చేసి సదరు ఫోల్డర్‌ను డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఫైల్ ట్రాన్స్‌ఫరింగ్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి అయిన వెంటనే మరోసారి డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆఫ్ చేస్తే సరిపోతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
6 Smart Tricks for Your Android Smartphone.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X