Home
Mobile

కొత్త ఫోన్ మోజు వదిలించుకోండి.. మీ పాత ఫోన్ కొత్త దానిలా పనిచేయాలంటే ఈ 6 టిప్స్ చాలు..

Buying a New Phone: కొత్త ఫోన్ కొంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది. కానీ చాలాసార్లు కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం అస్సలు ఉండదు. టీవీల్లో మెరిసే యాడ్లు, యూట్యూబ్ రివ్యూలు, లేటెస్ట్ ఫీచర్లు చూసి చాలామందికి కొత్త ఫోన్ కొనాలనిపిస్తుంది. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే మీ పాత ఫోనే కొత్త దానిలా మెరిసిపోతుంది. కొత్త ఫోన్ కోసం డబ్బులు వృధా చేయాల్సిన అవసరం లేదు.

మీ పాత ఫోన్‌ లుక్‌ను కొన్ని టిప్స్‌తో మార్చేయొచ్చు. దాని స్పీడ్ పెంచొచ్చు, అచ్చం కొత్త ఫోన్ కొన్న ఫీలింగ్ తెచ్చుకోవచ్చు. మేం చెప్పే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు, కొత్త ఫోన్ కొనాలనే కోరికను కంట్రోల్ చేసుకోవచ్చు. అవేవో చూద్దాం.

6 Smart Tricks to Stop Yourself from Buying a New Phone

* కొత్త ఫోన్ యాడ్స్, రివ్యూ వీడియోలు చూడటం మానేయాలి

ఫోన్ రివ్యూలు చూస్తే చాలు, కొత్త ఫోన్ కొనాలనే కోరిక పుట్టుకొస్తుంది. రివ్యూ చేసేవాళ్లు కొత్త ఫోన్‌లో ఉన్న సూపర్ ఫీచర్లు, అప్‌డేట్స్‌ గురించి పొగిడేస్తారు. దాంతో పాత ఫోన్లు వాడినోళ్లంతా తమ ఫోన్ ఔట్ డేటెడ్ అయిపోయిందేమోనని ఫీలవుతారు. కొందరు కొత్త ఫోన్ కొనాల్సిన పనిలేదని రివ్యూవర్లు చెబుతారు.

కానీ మన మైండ్ మాత్రం కొత్త ఫోన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే టెక్ ఛానెల్స్ చూడటం మానేయాలి. "బెస్ట్ ఫోన్" ఆర్టికల్స్ స్కిప్ చేయాలి. ఫోన్ కంపారిజన్ వీడియోలకు దూరంగా ఉండాలి. ఇలాంటివి చూడకపోతే కొత్త ఫోన్ కొనాలనే కోరిక తగ్గుతుంది, మీ పాత ఫోన్ తోనే హ్యాపీగా ఉండొచ్చు.

ఆన్‌లైన్‌లో ఏం చూస్తే, అలాంటి యాడ్సే సోషల్ మీడియాలో, సెర్చ్ ఇంజన్లలో కనిపిస్తాయి. కొత్త ఫోన్ల గురించి వెతకడం, టెక్ రివ్యూలు క్లిక్ చేయడం చేస్తే ఫోన్ యాడ్స్ ఎక్కువ వస్తాయి. దాంతో కొత్త ఫోన్ కొనాలనే ఆశ పెరుగుతుంది. ఇది తగ్గించుకోవాలంటే కిచెన్ అప్లయన్సెస్ లేదా కారు యాక్సెసరీస్ లాంటివి వెతకడం మొదలుపెట్టాలి.

* కొత్త థీమ్‌తో ఫోన్ లుక్ మార్చేయవచ్చు..

ఫోన్ లుక్ ఒక్కసారి మార్చితే చాలు, ఫోన్ కొత్త దానిలా మారిపోతుంది. ఆండ్రాయిడ్ యూజర్లు కొత్త లాంచర్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది హోమ్ స్క్రీన్ లేఅవుట్ మొత్తాన్ని మార్చేస్తుంది. చాలా ఫోన్లలో థీమ్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. వాటితో ఐకాన్స్, ఫాంట్స్, కలర్స్ అన్నీ మారిపోతాయి.

వాల్ పేపర్లు, రింగ్ టోన్లు, నోటిఫికేషన్ సౌండ్స్ మార్చినా ఫోన్ కొత్తగా కనిపిస్తుంది. లైవ్ వాల్ పేపర్స్ పెట్టుకుంటే, టైమ్ ప్రకారం అవి మారుతూ ఉంటే ఇంకా అదిరిపోతుంది. చిన్న చిన్న మార్పులతోనే ఫోన్ లుక్ మొత్తం మారిపోతుంది, పైసా ఖర్చు లేకుండానే కొత్త ఫోన్ ఫీలింగ్ వస్తుంది.

* అప్‌గ్రేడ్ వద్దనుకోవాలి

ఏదైనా కొనాలనుకున్నప్పుడు తొందరపడకుండా కాస్త ఆగి ఆలోచిస్తే మంచి నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త ఫోన్ కొనాలనిపించిన వెంటనే ఆర్డర్ పెట్టేయకుండా, ఆ ఫోన్‌ను ఆన్‌లైన్ కార్డ్‌లో వేసి రెండు వారాలు ఆగాలి. ఈ టైంలో మీ పాత ఫోన్ ఎలా పనిచేస్తుందో గమనించాలి. బాగా ల్యాగ్ అవుతుందా, ఫ్రీజ్ అవుతుందా, బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడాలి.

నిజంగానే మీ ఫోన్ బాగా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు కొత్త ఫోన్ కొనడం గురించి ఆలోచించొచ్చు. కానీ కొనాలనే తొందర తగ్గిపోతే, కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదని మీకు మీరే అర్థం చేసుకోవచ్చు. ఊరికే అనిపించినవి కాకుండా, నిజంగా ఉన్న ప్రాబ్లమ్స్ రాసుకుంటే, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు.

* యాక్సెసరీలు కొనాలి

కొన్నిసార్లు కొత్త ఫోన్ కొనే బదులు, యాక్సెసరీలు అప్‌గ్రేడ్ చేస్తే సరిపోతుంది. మంచి నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ బడ్స్ కొంటే మ్యూజిక్ వినడం, ఫోన్ మాట్లాడే అనుభూతి మెరుగుపడుతుంది. బ్యాటరీ కేస్ లేదా పవర్ బ్యాంక్ ఉంటే బ్యాటరీ టెన్షన్ ఉండదు. స్టైలిష్ గ్రిప్ లేదా స్టాండ్ కొంటే ఫోన్ వాడటం ఈజీ అవుతుంది.

బుక్స్ చదివే అలవాటు ఉంటే ఈ-ఇంక్ టాబ్లెట్ కొనొచ్చు, ఫొటోలు ప్రియులు మంచి కెమెరా కొనుక్కోవచ్చు. స్మార్ట్‌వాచ్ కొంటే ఫోన్ స్క్రీన్‌టైమ్ తగ్గి, ఫోన్ లైఫ్ పెరుగుతుంది. కొత్త ఫోన్ కేస్ వేస్తే పాత ఫోన్ లుక్ మొత్తం మారిపోతుంది. బోల్డ్ కలర్ కేస్, టెక్చర్డ్ డిజైన్ కేస్ లేదా లెదర్ ఫ్లిప్ కేస్ ప్రయత్నించొచ్చు

* ఫోన్ క్లీన్ చేయాలి.

చాలాసార్లు ఫోన్ పాతబడిపోవడం వల్ల స్లో అవ్వదు, చెత్త ఎక్కువైపోవడం వల్ల స్లో అవుతుంది. వాడని యాప్స్ తీసేయాలి, క్యాచీ డేటా క్లియర్ చేయాలి. డూప్లికేట్, అనవసరమైన ఫైల్స్ డిలీట్ చేయాలి. పాత మెసేజ్లు, బ్లర్ ఫొటోలు, వద్దు అనుకున్న డౌన్‌లోడ్స్‌ అన్ని తీసేయాలి.

* ఫోన్ లోని సీక్రెట్ ఫీచర్స్ తెలుసుకోవాలి

చాలామందికి ఫోన్‌లోని ఫుల్ ఫీచర్స్ గురించి తెలీదు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, స్ప్లిట్-స్క్రీన్ మల్టీ టాస్కింగ్, క్విక్ ఫైల్ షేరింగ్ లాంటి ఫీచర్లు ఫోన్‌ను కొత్తదానిలా ఉంచుతాయి. జెశ్చర్ బేస్డ్ నావిగేషన్‌తో ఒక చేత్తోనే ఫోన్ వాడొచ్చు, ఏఐ అసిస్టెంట్స్‌తో పనులు ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి సీక్రెట్ ట్రిక్స్‌తో పాత ఫోనే కొత్తగా అనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
Keep your old phone feeling new. Avoid reviews, refresh look with themes/cases, delay upgrade, use accessories, clean phone, explore features, block ads. Save money and phone life.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X