దూసుకొచ్చిన హెచ్‌టీసీ బోల్ట్

భారీ అంచనాల మధ్య హెచ్‌టీసీ తన 'బోల్ట్' స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.40,500 (అమెరికా కరెన్సీలో). గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే భిన్నమైన ఫీచర్లతో లాంచ్ అయిన హెచ్‌టీసీ బోల్ట్ ప్రత్యేకతల పై స్పెషల్ ఫోకస్...

Read More : ల్యాప్‌టాప్ తీసుకువెళ్లండి, 50 రోజుల తరువాత డబ్బులు చెల్లించండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగం

హెచ్‌టీసీ బోల్ట్ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యాధునిక సెల్యులార్ టెక్నాలజీ సరాసరి 250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగలదట. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ ఎల్టీఈ కనెక్షన్‌తో పోలిస్తే ఈ వేగం 10 రెట్లు ఎక్కువన్నమాట.

Snapdragon 810 chipset

ఈ ఏడాదికి గాను అత్యుత్తమ క్వాల్కమ్ చిప్‌సెట్‌లలో ఒకటైన Snapdragon 810 chipsetను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేయటం జరిగింది. 3జీబి ర్యామ్ సపోర్ట్ తో వస్తోన్న ఈ ఫోన్ లో 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు

Cat 9 LTE, యూఎస్బీ టైప్-సీ, బ్లుటూత్ 4.1 వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

ఆండ్రాయిట్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

హెడ్‌ఫోన్ జాక్ ఉండదు

యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ తరహాలోనే హెచ్‌టీసీ బోల్ట్ స్మార్ట్‌ఫోన్‌లో హెడ్‌ఫోన్ జాక్ ఉండదు.

క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే..

ఐపీ57 సర్టిఫికేషన్‌తో వస్తున్న ఈ ఫోన్ వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Ways HTC Bolt Is Different From HTC 10. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot