ఈ చిట్కాలతో మీఫోన్ బ్యాటరీ సేవ్

Written By:

చాలా మంది తమ ఫోన్లలో బ్యాటరీ సరిగా రావడం లేదని చెబుతుంటారు ఇంటర్నెట్ ఆన్ చేసిన 10 నిమిషాలకే బ్యాటరీ మొత్తం అయిపోతుందని తెగ బాధపడిపోతుంటారు. బ్యాటరీని ఇంప్రూవ్ చేసుకునే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం కొన్ని మార్గాలున్నాయి. మీ బ్యాటరీని సేవ్ చేసేందుకు మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మీ బ్యాటరీ ఎక్కువసమయం వస్తుంది. మరి ఆ చిట్కాలేంటో ఓ సారి చూద్దాం.

Read more: మీ ఫోన్ ఎప్పుడూ కొత్తగా కనపడాలంటే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్లోజ్ యాప్స్ ( Closing unused apps)

క్లోజ్ యాప్స్ ( Closing unused apps)

మీరు రకరకాల యాప్స్ అన్నీ ఫోన్లే పెట్టేస్తుంటారు. ఈ యాప్స్ మీరు ఆన్ చేయకున్నా కాని మీ బ్యాటరీని తినేస్తాయి.. బ్యాక్‌సైడ్ అవి రన్ అవుతూ బ్యాటరీని తినేస్తుంటాయి కూడా. సో మీకు కావలిసిని అత్యవసర యాప్స్ మాత్రమే పెట్టుకుని మిగతా యాప్స్ ని క్లోజ్ చేస్తే మీ బ్యాటరీ సేవ్ అయినట్లే.

వైఫై

వైఫై

వైఫై ని మీరు ఎక్కడబడితే అక్కడ ఆన్ చేయకుండి. అది కూడా చాలా ప్రమాదం మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.అంతే కాకుండా బ్యాటరీ కూడా తినేస్తుంది.

లొకేషన్ సర్వీస్

లొకేషన్ సర్వీస్

మీరు మీ లొకేషన్ సర్వీసు ఎప్పుడూ ఆన్ చేసి పెట్టుకోవడం వలన బ్యాటరీ ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోయే ప్రమాదం ఉంది. అవసరమైన చోట అదీ అత్యవసరమనుకుంటేనే ఈ యాప్ ని ఆన్ చేయండి.

డేటా మీద వైఫై ఆన్ చేయవద్దు

డేటా మీద వైఫై ఆన్ చేయవద్దు

మీరు ఎప్పుడూ వైఫై మీద మీ ఫోన్ రన్ చేసేటప్పుడు కాని లేకుంటే మీ ఫోన్ డేటా మీద రన్ అవుతున్నప్పుడు కాని ఏదైనా ఒకటే ఆన్ చేయండి. వైఫై మీద పనిచేస్తుంటే డేటా ఆఫ్ చేయండి. డేటా మీద ఉన్పప్పుడు వైఫై ఆఫ్ చేయండి ఇలా చేయడంవల్ల బ్యాటరీ బ్యాకప్ పెరిగే అవకాశం ఉంది.

సిరి అండ్ గూగుల్

సిరి అండ్ గూగుల్

ఇవి కూడా మీరు అవసరమైనప్పుడే ఓపెన్ చేయండి. ఆపిల్ కయితే సిరి గూగుల్ కయితే ఒకే అని వస్తుంటుంది. వీటిని కూడా మీరు అనవసర సమయాల్లో ఓపెన్ చేయకుండా ఉండటం మంచింది.

ధర్డ్ పార్టీ ఛార్జజ్ వాడొద్దు

ధర్డ్ పార్టీ ఛార్జజ్ వాడొద్దు

మీరు మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టేసమయంలో అనేక కేబుల్స్ ఉంటాయి. సో వీటివల్ల కూడా ఫోన్ వేడెక్కి పాడయిపోయే ప్రమాదం ఉంది. సో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఇది ఓ సారి చెక్ చేసుకుంటే మనకే మంచిది.

బ్యాటరీని చార్జింగ్

బ్యాటరీని చార్జింగ్

ఈ రోజుల్లో ఏ ఫోన్ కూడా బ్యాటరీ సామర్థ్యం అనుకున్నంతగా ఉండటం లేదు. మనం ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా ఫోన్ ఛార్జింగ్ పూర్తి అయిన వెంటనే తీసి వేయడం మంచింది. లేకుంటే బ్యాటరీ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 7 biggest battery-saving myths
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot