స్మార్ట్‌ఫోన్ మోజులో పడి మీ కంటి చూపును నిర్లక్ష్యం చేయకండి

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ద్వారా వెలువడే ప్రకాశవంతమైన బ్లూ కలర్ లైట్‌ను రాత్రుళ్లు చూడటం కంటికి, శరీరానికి, మెదడుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోవటం చాలా కష్టమైనా పనే అయినా మానుకోక తప్పదంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్ వెళుతురు కారణంగా సంభవించే కంటి ఒత్తిడికి దూరంగా ఉండేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను, పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాంతికి అనుగుణంగా ఫోన్ బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసే యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ యాప్స్ ను ట్రై చేసి చూడండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 2

స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచి చూడటం మొదలు పెట్టండి. ఫోన్ తెరకు మీ కంటికి కనీసం 16 నుంచి 18 అంగుళాల దూరమైనా ఉండేలా చూసుకోండి.

టిప్ 3

స్ర్కీన్ ముందు నిరంతరాయంగా పనిచేస్తున్న సమయంలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. స్మార్ట్‌ఫోన్ ముందు కూర్చొని ఎక్కువసేపు పనిచేయవల్సి వచ్చినపుడు కళ్లను తరచూ బ్లింక్ చేస్తూ ఉండండి.

టిప్ 4

స్మార్ట్‌ఫోన్‌ను సుధీర్ఘంగా వినియోగించాల్సి వస్తే రీడింగ్ గ్లాస్‌‌ను దరించండి. లేని పక్షంలో మీ మొబైల్‌కు యాంటీ గ్లేర్ కోటింగ్స్‌ను వేయించండి. ఫోన్‌లోని టెక్స్ట్ సైజు‌ను పెంచుకోవటం ద్వారా కళ్లకు అంతకు ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా వెబ్ కంటెంట్, ఈమెయిల్ మెసేజెస్ వంటి రీడబుల్ యాక్టివిటీస్‌ను సులువుగా టాకిల్ చేయవచ్చు.

టిప్ 5

ఫోన్ స్ర్కీన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల స్ర్కీన్ పై పేరుకుపోయిన దుమ్ము, మరకలు, వేలి మద్రులు తొలగిపోయి క్లియర్ గా ఉంటుంది. కళ్లకూ ఎఫెక్ట్ ఉండదు.మీ స్మార్ట్‌ఫోన్‌కు యంటీ బ్లూరే ప్రోటెక్టర్‌ను ఏర్పాటు చేసుకున్నట్లయితే బ్లు‌లైట్ ఒత్తిడి నుంచి మీ కళ్లను కాపాడుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Easy Ways to Save Your Eyes From Smartphone Strain. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot