డ్యుయల్ కెమెరా ఫోన్‌ల గురించి 7 ఆసక్తికర విషయాలు
హెచ్‌టీసీ, హువావే, ఒప్పో, వివో, కూల్‌ప్యాడ్, లెనోవో, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు మల్టిపుల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.
కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు గిరాకీ పెరుగుతోన్న నేపథ్యంలో డిజిటల్ కెమెరాలకు జనాదరణ తగ్గుతోంది. ఇందుకు కారణం డిజిటల్ కెమెరాల కల్పించలేని సౌకర్యాలు స్మార్ట్‌ఫోన్‌లు కల్పించటమే.
Read More : పోటాపోటీగా 4G Volte ఫోన్‌లు రిలీజ్, రూ.4000లోపే

డ్యుయల్ కెమెరా సెటప్
స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీని మరో ఎత్తుకు తీసుకువెళ్లే క్రమంలో డ్యుయల్ కెమెరా ఫోన్‌లను ఈ మధ్య మార్కెట్లో లాంచ్ చేయటం జరుగోతంది. హెచ్‌టీసీ, హువావే, ఒప్పో, వివో, కూల్‌ప్యాడ్, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు మల్టిపుల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారిన డ్యుయల్ కెమెరా ఫోన్‌ల గురించి 7 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రెండు కెమెరా లెన్సులు ఉంటాయి
అది ముందైనా కావొచ్చు, వెనుకైనా కావొచ్చు .. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో ఒక కెమెరా లెన్స్ ఉండాల్సిన స్థానంలో రెండు కెమెరా లెన్సులు ఉంటాయి. వీటిలో ఒకటి ప్రైమరీ లెన్స్ కాకా, మరొకటి సెకండరీ లెన్స్. ఫోటోలను చిత్రీకరించుకునే సమయంలో ప్రైమరీ లెన్స్ మేజర్ లిఫ్టింగ్ పై దృష్టిసారిస్తే, సెకండరీ లెన్స్ అదనపు లైట్ ఇంకా ఫీల్డ్ డెప్త్ పై పనిచేస్తుంది.

మొట్టమొదటి డ్యుయల్ కెమెరా ఫోన్ హెచ్‌టీసీ కంపెనీ
డ్యుయల్ కెమెరాలతో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ కంపెనీ 2011లో పరిచయం చేసింది. HTC Evo 3D పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో రెండు కెమెరాలు ఉంటాయి. 3డీ ఫోటోలను క్యాప్చురు చేసుకునే విధంగా ఈ డ్యుయల్ కెమెరాను రూపొందించారు. 2014లో ఇదే హెచ్‌టీసీ కంపెనీ మరో అత్యుత్తమ డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది. HTC one M8 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ HTC Evo 3Dతో పోలిస్తే మన్నికైన కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

ఫీల్డ్ డెప్త్ బాగుంటుంది..
డ్యుయల్ కెమెరా ద్వారా చిత్రీకరించుకునే ఫోటోల్లో ఫీల్డ్ డెప్త్ అనేది ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఫోటోలు చాలా క్లారిటీగా అనిపిస్తాయి.

అవే కీలక పాత్ర పోషిస్తాయి..
డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో సెన్సార్ సైజ్, పిక్సల్ సైజ్, అపెర్చుర్లు కీలక పాత్ర పోషిస్తాయి.

20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో Vivo V5 Plus
2015లో లెనోవో కంపెనీ Vibe S1 పేరుతో మొదటి డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుంది. తాజాగా చైనాకు చెందిన Vivo, V5 Plus పేరుతో శక్తివంతమైన డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.

ఇప్పుడు, రూ.13,000కే డ్యుయల్ కెమెరా ఫోన్
సంవత్సరం క్రితం వరకు డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదు రూ.35,000 పైనే ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో హానర్, కూల్ ప్యాడ్ వంటి కపెనీలు రూ.13,000కే డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్ కెమెరా బెస్టా..? డిజిటల్ కెమెరా బెస్టా..?
మంచి రిసల్యూషన్ క్వాలిటీ కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లను అన్ని వేళలా మీతో తీసుకువెళ్లవచ్చు. ఇదే సమయంలో బల్కీ కెమెరాలను క్యారీ చేయటం కదరదు. డిజిటల్ కెమెరాలను మోసుకెళ్లేందుకు ప్రత్యేకమైన బ్యాగ్ అవసరమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ఇలాంటివేవి ఉండవు. సింపుల్ గా మీ జేబులో పెట్టేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ కెమెరా బెస్టా.. డిజిటల్ కమెరా బెస్టా..?
ఏకాగ్రతతో తీయాల్సి వచ్చే కొన్ని కఠినమైన షాట్‌లకు డీఎస్ఎల్ కెమెరాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ చాలా హ్యాండీగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశాల్లో డీఎస్ఎల్ కెమెరాతో సాధ్యంకాని ఫోటో షూట్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరాతో చేపట్టవచ్చు.

స్మార్ట్‌ఫోన్ కెమెరా బెస్టా.. డిజిటల్ కమెరా బెస్టా..?
Android, iOS వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలు తమ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం రకరకాల కెమెరా సెంట్రిక్ యాప్స్‌ను అందిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో ఫోటోలను అత్యుత్తమ ఎడిట్ చేసుకోవటంతో పాటు అదనపు యానిమేషన్‌లను యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ కెమెరాలలో ఈ సౌకర్యాలు తక్కువ.

స్మార్ట్‌ఫోన్ కెమెరా బెస్టా.. డిజిటల్ కమెరా బెస్టా..?
స్మార్ట్‌ఫోన్ కెమెరాలను ప్రొఫెషనల్ కెమెరాలుగా తీర్చిదిద్దే అనేక ఉపకరణాలు మార్కెట్లో సిద్దంగా ఉన్నాయి. వీటిని అవసరమైనపుడు ఫోన్ కెమెరాకు ఫిట్ చేసుకుని ప్రొఫెషనల్ స్థాయిలో అనుభూతులతో ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

స్మార్ట్‌ఫోన్ కెమెరా బెస్టా.. డిజిటల్ కమెరా బెస్టా..?
డిజిటల్ కెమెరాలతో పోలిస్తే స్మార్ట్‌పోన్ కెమెరాలు నిరంతరం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. స్మార్ట్‌పోన్ కెమెరాతో షూట్ చేసే ఫోటోలను సెకన్ల వ్యవధిలో షేర్ చేయవచ్చు. అన్నిడిజిటల్ కెమెరాలతో ఇది సాధ్యం కాదు.

స్మార్ట్‌ఫోన్ కెమెరా బెస్టా, డిజిటల్ కెమెరా బెస్టా..?
ఫోటోగ్రఫీ రంగంలో పట్టు సాధించాలనుకునే వారికి స్మార్ట్‌పోన్ ఫోటోగ్రఫీ చక్కటి ప్రాక్టీస్. స్మార్ట్‌పోన్ ఫోటోగ్రఫీతో రకరకాల ప్రయోగాలను చేయవచ్చు.


Click it and Unblock the Notifications








