మోటో జీ5 కొంటున్నారా?, ఈ 7 ఆఫర్లు మీకే

మోటరోలా, మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ రెండు రోజల క్రితం ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.11,999. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న ఈ స్మార్ట్‌‌ఫోన్ పై 7 ప్రత్యేకమైన ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. ఈ లాంచ్ డే ఆఫర్లు ఏప్రిల్ 5, 6 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆఫర్ల వివరాలను పరిశీలించినట్లయితే...

Read More : మోటో జీ5, జీ5 ప్లస్‌‌ల మధ్య తేడాలేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెమరీ కార్డ్, ఇయర్ ఫోన్ ఉచితం

మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూతో పోలిస్తే అదనంగా రూ.500 లభిస్తుంది.
16జీబి SanDisk మెమరీ కార్డ్ ఉచితం (స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే),
Sennheiser CX180 ఇయర్ ఫోన్ ఉచితం,

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

రూ.1000 క్యాష్‌బ్యాక్‌, రోజుకు 1జీబి 4జీ డేటా

HDFC క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని మోటో జీ5ను కొనుగోలు చేసే వారికి రూ.1000 క్యాష్‌బ్యాక్‌,
Amazon Prime యూజర్లకు రూ.1000 క్యాష్‌బ్యాక్‌,
Amazon Kindle ఈ-బుక్స్ కొనుగోలు పై రూ.300 తగ్గింపు,
మోటో జీ5ను కొనుగోలు చేసిన ఐడియా యూజర్లు రూ.343 చెల్లించటం ద్వారా 26 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే 3000 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

నోకియా ఫోన్‌లు ఈ నెలలోనే వచ్చేస్తున్నాయ్!

మోటో జీ5 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1980 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రూ.26తో 26 గంటలు మాట్లాడుకోండి

మోటో జీ5 స్పెసిఫికేషన్స్..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2800mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్.

Galaxy On8 ధర తగ్గింది, ఎంతో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Offers to buy the Moto G5 smartphone on 5 and 6th April. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot