సచిన్ ఫోన్‌లు సంచలనం సృష్టిస్తాయా..?

Written By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ స్మార్ట్ర్రాన్ (Smartron) తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అయిన టీ.ఫోన్ (t.phone)ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువారం హైదరాబాద్‌లో లాంచ్ చేసారు. ధర రూ.22,999. జూన్ నుంచి ఈ ఫోన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. చైనా బ్రాండ్‌లతో పాటు దేశవాళీ బ్రాండ్‌లకు ధీటుగా రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్ర్రాన్ టీఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేద్దాం...

Read More : హైదరాబాద్‌‍లో యాపిల్ కొత్త ఆఫీస్, 4 వేల మందికి ఉద్యోగాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

స్మార్ట్ర్రాన్ టీ.ఫోన్ డ్యుయల్ - టోన్ మెటల్ బాడీతో వస్తోంది. ఫోన్ బరువు కేవలం 149 గ్రాములు. ఫోన్ అల్ట్రా తిన్ డిజైన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. క్లాసిక్ గ్రే, మెటాలిక్ పింక్, స్టీల్ బ్లు, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

స్మార్ట్ర్రాన్ టీ.ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ 1080x1920 పిక్సల్స్, 401 పీపీఐ పిక్సల్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. ఫోన్ డిస్‌ప్లేలో పొందుపరిచిన అసిర్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీ అత్యుత్తమ విజువల్ అనుభూతులను చేరువ చేస్తాయి.

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

స్మార్ట్ర్రాన్ టీ.ఫోన్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్‌తో వస్తోంది. 2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ సీపీయూలు ఈ చిప్‌సెట్‌లో పొందుపరిచారు. అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

స్మార్ట్ర్రాన్ టీ.ఫోన్‌లో 13 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఏర్పాటు చేసారు (6 ఎలిమెంట్స్ లెన్స్‌తో కూడిన ఐసోసెల్ సెన్సార్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్ ఆటోఫోకస్), ఎఫ్2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ మందుభాగంలో 4 మెగా పికల్స్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసారు.

 

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

స్మార్ట్ర్రాన్ టీ.ఫోన్‌  Android Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. TronX యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో టీ.క్లౌడ్, టీ.స్టోర్, టీ.కేర్ వంటి ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి.

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

స్మార్ట్ర్రాన్ టీ.ఫోన్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

స్మార్ట్రాన్ టీఫోన్ స్పెసిపికేషన్స్

యూఎస్బీ టైప్-సీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ సిమ్ ఇంకా స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్స్.

సచిన్ ఫోన్‌లు సంచలనం సృష్టిస్తాయా..?

ఇండియన్ స్టార్టప్ Smartronకు సచిన్ పెట్టుబడదారుగా ఉన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Reasons why Cricket icon Sachin Tendulkar supports Smartron t.phone!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot