ఈ వారంలో భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు, అవి ఇవే

Written By:

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మూడు నాలుగు రోజులు ఆగితే మీకు మరింత లాభం కలిగే అవకాశం ఉంది. టాప్ దిగ్గజాలైన శాంసంగ్, నోకియా, వీవో తదితర స్మార్ట్‌ఫోన్ సంస్థలు తామందిస్తున్న ప్రొడక్టులపై 15 నుంచి 30 శాతం వరకూ తగ్గింపును ప్రకటించనున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మరో వారం రోజుల వ్యవధిలో 7 స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. వాటి పూర్తి వివరాలను మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

నాలుగే ఫీచర్లతో Light Phone 2, ధర మాత్రం రూ. 26 వేలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రో

శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రో ధర రూ. 2 వేలు తగ్గి రూ. 18,900కు అందుబాటులోకి రానుంది.
గెలాక్సీ జే7 ప్రొ స్పెషిఫికేషన్లు..
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ 7870 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్‌ కెమెరా
13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3600 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోకియా 6

నోకియా 6 ధర రూ. 1,500 తగ్గి రూ. 13,499కి లభించనుంది.
నోకియా 6 స్పెసిఫికేషన్స్ 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

శాంసంగ్ జే 7 మ్యాక్స్

శాంసంగ్ జే 7 మ్యాక్స్ ధర రూ. 3 వేలు తగ్గి రూ. 11,900కు లభించనుంది.
శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్ ఫీచ‌ర్లు
7 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1280 × 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.5 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్, 1.5 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
200 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
డ్యుయ‌ల్ సిమ్‌, 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

వీవో వీ7 ప్లస్

వీవో వీ7 ప్లస్ రూ. 2 వేల డిస్కౌంట్ తో రూ. 19,990కు అందుబాటులోకి రానుంది.
వివో వీ7 ఫీచర్లు 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో వై53

వివో వై53 ధర రూ. 500 తగ్గి రూ. 8,499కి మార్కెట్లోకి రానుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో సిస్టమ్ పై పనిచేసే ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 16 జీబీ మెమొరీ, 8/5 ఎంపీ కెమెరాలు ఉంటాయి.

ఇన్ఫినిక్స్ జీరో 5

ఇన్ఫినిక్స్ జీరో 5 ధర రూ. 2 వేలు తగ్గి రూ. 15,999కి దిగిరానుంది. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఫోన్ పై, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడి కొనుగోలు చేస్తే, మరో 10 శాతం రాయితీ లభిస్తుంది. 5. అంగుళాల స్క్రీన్, 12/13 ఎంపీ కెమెరాలు ఉంటాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 4

ఇన్ఫినిక్స్ నోట్ 4 ధర రూ. 1000 తగ్గి రూ. 7,999కి రానుంది. ఇది కూడా ఫ్లిప్ కార్ట్ లోనే లభిస్తుంది. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ, 13/8 ఎంపీ కెమెరాలుంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 smartphones from Samsung, Nokia and others that got a price cut this week More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot