ఈ ఫోన్ల మధ్యనే పోటీ, గెలుపు రేసులో మిగిలేది కొన్నే !
ఇండియాలో అతి త్వరలో కొన్ని ఫోన్లు లాంచ్ కానున్నాయి.
ఇండియాలో అతి త్వరలో కొన్ని ఫోన్లు లాంచ్ కానున్నాయి. మొబైల్ ప్రియుల కోసం వివిధ రకాల కంపెనీల ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. వీటిలో నోకియా, షియోమి, హువాయి లాంటి కంపెనీ ఫోన్లు కూడా ఉన్నాయి. త్వరలో మార్కెట్ లోకి దూసుకురానున్న ఈ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

షియోమీ రెడ్‌మీ 4 ప్రైమ్
5 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.11,990 ధరకు ఈ ఫోన్ లభించేందుకు అవకాశం ఉంది.

హానర్ 9
5.1 ఇంచ్ డిస్‌ప్లే, 2.36 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.25,990 ధరకు లభ్యమయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్9 ప్లస్
5.8 ఇంచ్ డిస్‌ప్లే, 1.95 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.34,990 ధరకు ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎల్1
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ, 2620 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.9,990 ధరకు ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది.

నోకియా 5
5.2 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ.12,899 ఉండే అవకాశం ఉంది.

షియోమీ ఎంఐ6
5.15 ఇంచ్ డిస్‌ప్లే, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.23,990 ధరకు ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

నోకియా 6
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 16, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.14,999 ధరకు ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








