Opera బ్రౌజర్ ఎందుకంత బెస్ట్..?

|

గూగుల్ క్రోమ్, యాపిల్ సఫారీ బ్రౌజర్‌లకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో సేవలందిస్తోన్న థర్డ్ పార్టీ బ్రౌజింగ్ యాప్ Opera Mini దూసుకుపోతోంది. వేగవంతమైన మొబైల్ బ్రౌజింగ్ యాప్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఒపెరా బ్రౌజర్‌కు దేశవ్యాప్తంగా 5 కోట్ల పై చిలుకు యూజర్లు ఉన్నారు.

Opera బ్రౌజర్ ఎందుకంత బెస్ట్..?

తమ వినయోగదారులకు మరింత యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియాన్స్‌ను అందించే క్రమంలో Opera Mini browser appను తాజాగా కంపెనీ అప్‌డేట్ చేసింది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్‌ వర్షన్ ఒపెరా మినీ బ్రౌజర్ భాగంగా మొబైల్ డేటా యూసేజ్ పై 90% వరకు సేవింగ్స్‌ను అందిస్తోంది.

స్పష్టమైన ఆధిక్యతతో...

స్పష్టమైన ఆధిక్యతతో...

మొబైల్ బ్రౌజింగ్ యాప్స్ విభాగంలో యూసీ బ్రౌజర్‌తో Opera Mini పోటీ పడుతోంది. తాజాగా.. ఒపెరా మినీ, యూసీ వెబ్ ఇంకా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ల మధ్య నిర్వహించిన speed testలలో ఒపెరా మినీ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోయింది. ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌తో పోలిస్తే 72% వేగవంతంగా, యూసీ బ్రౌజర్‌తో పోలిస్తే 64% వేగవంతంగా స్పందిస్తుంది.

సరికొత్త అనుభూతులు..

సరికొత్త అనుభూతులు..

ఒపెరా మినీ బ్రౌజర్‌ను మరింత శక్తివంతంగా మార్చేసిన లేటెస్ట్ అప్‌డేట్.. సింక్రనైజింగ్ డేటా, బ్లాకింగ్ యాడ్స్, కంప్రెసింగ్ వీడియోస్ వంటి ఆసక్తికర ఫీచర్లను అదనంగా యాప్‌లో చేర్చింది. లేటెస్ట్ ఒపెరా మినీ బ్రౌజర్‌ లోని హైక్వాలిటీ డిజైన్, ఈజీ టు యూజ్ ఇంటర్‌ఫేస్‌లు స్మూత్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు
 
ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్‌లో Speed Dial list పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఆప్షన్‌లో మీ ఫేవరెట్ వెబ్‌సైట్‌లను సేవ్ చేసుకుని స్పీడ్ డయల్ ద్వారా వేగవంతంగా యాక్సిస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్, మీ బ్రౌజింగ్ వేగాన్ని మరింత పెంచుతుంది.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన మరో ఫీచర్ వీడియో బూస్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా వీడియోలను ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించవచ్చు. వీడియో బూస్ట్ టెక్నాలజీని అందిస్తోన్న మొట్టమొదటి బ్రౌజర్ Opera Mini కావటం విశేషం. ఈ ఫీచర్ ఆన్‌లైన్‌లో మీరు వీక్షించే వీడియోల సైజును తగ్గించి ఎటువంటి అంతరాయం లేకుండా ప్లే అయ్యేలా చూస్తుంది.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

మీ ఫేవరెట్ వెబ్‌సైట్‌లను ఫోన్ హోమ్ స్ర్కీన్ పై షార్ట్‌కట్‌ల రూపంలో ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఒపెరా మినీ కల్పిస్తోంది.ఇలా చేయటం వల్ల ఫోన్ ర్యామ్ మరింత ఆదా అవటంతో పాటు సదరు వైబ్‌సైట్‌లోకి వేగవంతంగా యాక్సిస్ కావొచ్చు.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

నెట్‌వర్క్ స్లోగా ఉన్నప్పడు వీడియో స్ట్రీమింగ్ నెమ్మదించటం సహజం. ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఒపెరా మినీ బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన బిల్ట్ ఇన్ మీడియా ప్లేయర్ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లతో పాటు న్యూస్ సైట్‌లలోని వీడియోలు నేరుగా యూజర్ ఫోన్ లేదా మెమరీ కార్డ్‌లోకి డౌన్‌లోడ్ చేసేస్తుంది. ఒపెరా మినీ డౌన్‌లోడ్ మేనేజర్ ఆప్షన్ ద్వారా యూజర్ ఈ డౌన్‌లోడింగ్ ప్రక్రియను తనకు కావల్సిన విధంగా మేనేజ్ చేసుకోవచ్చు.

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో స్ర్కీన్ పై ప్రత్యక్షమయ్యే యాడ్స్ చికాకుపుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఒపెరా మినీ బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన అప్‌డేటెడ్ యాడ్ బ్లాకర్ ఫీచర్ పనికిరాని యాడ్‌లను బ్లాక్ చేసేస్తుంది. బ్రౌజర్‌లో యాడ్ బ్లాకర్‌ను ఎనేబుల్ చేసి ఉంచటం వల్ల బ్రౌజింగ్ వేగాన్ని 40శాతానికి పెంచుకోవచ్చు.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్ తెలుగు సహా 13 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

మొబైల్ నెట్‌వర్క్ స్పీడ్స్ నెమ్మదిగా ఉన్నప్పటికి స్మూత్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఒపెరా మినీ బ్రౌజర్ చేరువ చేస్తుంది. నెట్‌వర్క్ వేగం నెమ్మదిగా ఉన్న సమయాల్లో ఒపెరా మినీ బ్రౌజర్ యూజర్‌కు అవసరమైన డేటాను కంప్రెస్ చేసి అందిస్తుంది.

 ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

ఒపెరా మినీ బ్రౌజర్లోని 7 టాప్ క్వాలిటీ ఫీచర్లు

రాత్రి వేళల్లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసే వారికి దృష్టిలో ఉంచుకుని ఒపెరా మినీ బ్రౌజర్ ప్రత్యేకమైన నైట్ మోడ్‌ను ఆఫర్ చేస్తుంది. రాత్రివేళల్లో ఈ నైట్ మోడ్‌ను ఆన్ చేసుకోవటం ద్వారా కళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ బ్రౌజర్ ఆఫర్ చేస్తోన్న Smooth UI and interface యూజర్ ప్రెండ్లీ బ్రౌజింగ్‌ను చేరువచేస్తుంది.

Best Mobiles in India

English summary
7 Surprising ways Opera Mini is better than UC browser for smartphone browsing. Read More in Telugu Gizbot...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X