ఈ ఏడు ఫీచర్లు లేని ఆండ్రాయిడ్ ఫోన్ కొనకండి !

ఈ ఏడు ఫీచర్లు ఉంటేనే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కొనండి.లేకుంటే మీరు కొనే ఫోన్ అనవసరమే అని చెప్పవచ్చు.

By Hazarath
|

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చే సాధనం కూడా అదే. కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ కొనే సమయంలో అందరూ ఆచితూచి స్పందిస్తున్నారు. బెస్ట్ ఫీచర్లు ఉంటేనే ఫోన్ కొంటున్నారు. అలాంటి వారికోసం నిపుణులు కొన్ని ఫీచర్లు చెబుతున్నారు. అవి ఉంటేనే కొనమని చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ ఈ గాడ్జెట్లను చంపేసిందని మీకు తెలుసా..?స్మార్ట్‌ఫోన్ ఈ గాడ్జెట్లను చంపేసిందని మీకు తెలుసా..?

ఫాస్ట్ ప్రాసెసర్

ఫాస్ట్ ప్రాసెసర్

ఆండ్రాయిడ్ ఫోన్లకు హార్ట్ వంటిది. ఇది బాగుంటేనే ఫోన్ ఫాస్ట్ గా రన్ అవుతుంది. కాబట్టి ప్రాసెసర్ చాలా ఫాస్ట్ గా ఉండేది కొనడం ఉత్తమం. ఇప్పుడు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ మంచి జోరు మీద ఉంది. 800, 600సీరిస్ ఉన్న ఫోన్లు కొనేందుకు ప్రయత్నించండి.

కనీసం 4జిబి ర్యామ్

కనీసం 4జిబి ర్యామ్

ఇప్పుడు ర్యామ్ కూడా చాలా ముఖ్యమైనది. కనీసం 4జీ ర్యామ్ ఉండే ఫోన్లు కొనడం ఉత్తమం. యూజర్లకనుగునంగా 8జిబి ర్యామ్ ఫోన్లు కూడా ఇప్పుడు బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి 4జిబి ర్యామ్ ఫోన్లపై దృష్టి సారించండి.

 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్

32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్

ఇది కూడా చాలా ముఖ్యమైనది. కనీసం 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటేనే స్టోర్ చేసుకునేందుకు వీలుంటుంది. దాంతో పాటు ఎస్ డి స్లాట్ కూడా ఉండేలా చూసుకోవాలి.

అందమైన డిస్‌ప్లే

అందమైన డిస్‌ప్లే

మొబైల్ కొనేవారు డిస్‌ప్లే సైజు ఎక్కువగా ఉండేవాటిని కొనుక్కోవడం ఉత్తమం. ఇప్పుడు మార్కెట్లో 5.5, 6 ఇంచ్ డిస్‌ప్లే ఫోన్లు లభిస్తున్నాయి.

మంచి బ్యాటరీ లైఫ్

మంచి బ్యాటరీ లైఫ్

ఇప్పుడు ఫోన్లలో ఉన్న ప్రధాన సమస్య ఇదే. మంచి MAh బ్యాటరీ ఉండే ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి.వాటి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మీకు మంచి ఫోన్ దొరికినట్లే.

హై క్వాలిటీ కెమెరా

హై క్వాలిటీ కెమెరా

ఈ రోజుల్లో కెమెరా లేని ఫోన్ వేస్ట్. నడుస్తున్న డిజిటల్ యుగంలో కెమెరానే ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఇక సెల్ఫీల పిచ్చి ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే. కాబట్టి దీని విషయంలో జాగ్రత్త వహించాలి.

మంచి కనెక్టివిటి

మంచి కనెక్టివిటి

ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ఫీచర్లు చాలా ముఖ్యమైనవి. బ్లూటూత్, యూఎస్ బి కనెక్షన్, Head phone jac, Fingerprint scanner, water resistant లాంటి ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి.

 

 

Best Mobiles in India

English summary
7 Things Your Next Android Phone Needs to Have Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X