iPhone Xను తలపిస్తోన్న 8 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఐఫోన్ ఎక్స్ రాకతో 'notch display' ఫోన్‌లకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
ఐఫోన్ ఎక్స్ రాకతో 'notch display' ఫోన్‌లకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్ విభాగంలో సరికొత్త మార్పుకు తెరతీసిన నాట్చ్ డిస్‌ప్లే ట్రెండ్‌ను ప్రతిఒక్కరూ ఆస్వాదించాలనుకుంటున్నారు. నాట్చ్ డిస్‌ప్లే ఫోన్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో హానర్, ఎల్‌జీ, ఒప్పో, వన్‌ప్లస్, వివో వంటి ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఈ మోడల్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 300 మిలియన్ల నాట్చ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో 55 శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌లు కాగా, 45 శాతం ఫోన్‌లు యాపిల్ నుంచి లాంచ్ అయినవి. ఐఫోన్ ఎక్స్ తరహా నాట్చ్ డిస్‌ప్లేతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోన్న 8 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హానర్ ప్లే (Honor Play)
హానర్ బ్రాండ్ నుంచి ఇటీవల Honor Play పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. స్పెక్స్ విషయానికి వచ్చేసరికి.. 6.29 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ వచ్చేసరికి 2340 x 1080పిక్సల్స్) విత్ 19.5:9 యాస్పెక్ట్ రేషియో, లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ కైరిన్ 970 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి).

ఎల్‌జీ జీ7+ థింక్ ( LG G7+ ThinQ)
ఎల్‌జీ బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో LG G7+ ThinQ ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. మరికొద్ది రోజుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ధర రూ.39,990. స్పెక్స్ విషయానికి వచ్చేసరికి.. 6.1 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఫుల్ విజన్ డిస్‌ప్లే విత్ సెకండరీ స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 3000mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

హువావే నోవా 3 (Huawei Nova 3)
హువావే నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో Huawei Nova 3 ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.34,999గా ఉంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి 6.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ నాట్చ్ డిస్‌ప్లే (2340 x 1080 రిసల్యూషన్ పిక్సల్స్) విత్ 19.5:9 యాస్పెక్ట్ రేషియో అండ్ 409 పీపీఐ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ కైరిన్ 970 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

హువావే నోవా 3ఐ (Huawei Nova 3i)
హువావే నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో Huawei Nova 3i ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ధర రూ.20,999. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి 6.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ నాట్చ్ డిస్‌ప్లే (2340 x 1080 రిసల్యూషన్ పిక్సల్స్) విత్ 19.5:9 యాస్పెక్ట్ రేషియో అండ్ 409 పీపీఐ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ కైరిన్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

హానర్ 9ఎన్ (Honor 9N)
హానర్ బ్రాండ్ నుంచి మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో హానర్ 9ఎన్ ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ధర రూ.11,999. స్పెక్స్ విషయానికి వచ్చేసరికి.. 5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ నాట్చ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080x2280 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ కైరిన్ 659 ప్రాసెసర్.

ఒప్పో ఏ3ఎస్ (Oppo A3s)
ఒప్పో బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో Oppo A3s ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ధర రూ.10,990. ఫోన్ స్పెక్స్ విషయానికి వచ్చేసరికి 6.2 అంగుళాల సూపర్ ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే విత్ ఫుల్ ఐపీఎస్ లామినేషన్ స్ర్కీన్.

వన్‌ప్లస్ 6 (OnePlus 6)
వనప్లస్ బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో OnePlus 6 ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ధర రూ.34,999. ఫోన్ స్పెక్స్ విషయానికి వచ్చేసరికి 6.28 అంగుళాల ఫుల్ ఆప్టిల్ అమెల్డ్ డిస్ ప్లే(1080x 2280పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, అడ్రినో 630 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఒప్పో ఎఫ్7 (Oppo F7 )
ఒప్పో బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో Oppo F7 ఒకటి. ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ధర రూ.21,990. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 6.23 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (1080x 2280 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.


Click it and Unblock the Notifications








