4 జీ ఫోన్స్ చాలా ఛీప్ గురూ

Written By:

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..అయితే అది బోర్ కొట్టేసిందా.. అయితే మీకోసమే 4జీ ఫోన్స్ అత్యంత తక్కువ ధరలలో రెడీగా ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ 4జీ ట్రెయిల్స్ ని అన్ని ప్రధాన నగరాల్లో

ఆఫర్ చేస్తోంది. అత్యంత స్పీడ్ తో జియో కూడా ఈ సంవత్సరమే దూసుకువస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్ లకు రాంరాం చెప్పి 4 జీ వైపు పరుగులు పెట్టండి. 8 రకాల 4జీ ఫోన్స్ మీ కోసం రెడీగా ఉన్నాయి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ZTE Blade Qlux

1.

4 జీ ఫోన్లలో అత్యత తక్కువ ధర గల ఫోన్ ఇదే. ధర రూ. 4,999. ఇది 4.5 fwvga(480x854p)ips డిస్ ప్లేతో పని చేస్తుంది. 1 జిబీ రామ్ తో పాట్ 8 జీబి ఇంటర్నల్ స్టోరేజి కూడా ఉంది. 32 జీబి వరకు మెమొరీని విస్తరించుకోవచ్చు. 8 మెగా పిక్షల్ కెమెరా తో పాటు 5 మెగా పిక్షల్ ఫ్రంట్ కెమెరా,ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ తో రెడిగా ఉంది.ఆండ్రాయిడ్ కిట్ కాట్ 4.4.2.

Yu Yuphoria

2.

ఇంకొంచెం ఎక్కువ పెట్టాలనుకునే వారికి రూ. 6999 ధరతో Yu Yuphoria రెడీగా ఉంది. 5-inch డిస్ ప్లేతో గొరిల్లా గ్లాస్ 3 తో పనిచేస్తుంది.2 జిబి DDR3 ర్యామ్ ,16 జిబీ ఇంటర్నెల్ స్టోరేజి తో పాటు 128 జిబి వరకు మెమొరీని విస్తరించుకోవచ్చు. 8 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియోని 1080 క్వాలిటీలో తీయవచ్చు. డ్యూయెల్ కోర్ సిమ్ తో మార్కెట్లో సిద్ధంగా ఉంది.

Xiaomi Redmi 2

3

1 జీబి ర్యామ్ తో పాటు 4.7 hd స్కీన్ తో, డ్రాగన్ గ్లాస్ తో ఈ ఫోన్ సిద్ధం. 8 జీబి ఇంటర్నెల్ స్టోరేజితో పాటు 32 జీబి వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. 8 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 2 మెగా ఫిక్షల్ ఫ్రంట్

కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.4 వర్షన్ కలిగి MIUI 6.0 సాఫ్ట్ వేర్ కలిగి ఉంటుంది. దీని ధర రూ. 6,999.

 

Lenovo A6000

4.


5 inch hd డిస్ ప్లేతో కిరాక్ పుట్టించే ఈ ఫోన్ ధర రూ.6999. 1 జీబి ర్యామ్ తో పాటు 8 జీబి స్టోరేజి కెపాసిటీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ వర్షన్ తో పని చేస్తుంది. 8 మెగా ఫిక్షల్ కెమెరా, 2 మెగా ఫిక్షల్

ఫ్రంట్ కెమెరా 3జీ, 4జీ సపోర్ట్ తో పనిచేస్తుంది.ఈ ఫోన్ కున్న ఇంకో స్పెషాలిటీ డాల్బే డిజిటల్ సౌండ్. రెండు స్పీకర్లతో పని చేస్తుంది.

 

Infocus M350

5

దీని ధర రూ.7999.ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వర్షన్ తో 5 -inch HD IP టచ్ స్కీన్ తో లభిస్తోంది. 2 జీబి రామ్, 16 జీబి ఇంటర్నెల్ స్టోరేజి. 8 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 8 సెకండరీ కెమెరా ఉంటుంది.

Huawei Honor 4X

6

దీని ధర రూ.10449. 5.5 inch IPS HD (720x1280p) డిస్ ప్లే తో పని చేస్తుంది. 2 జీబి రామ్ 8 జీబి ఇంటర్నెల్ స్టోరేజ్ తో పాటు విస్తరించుకునే సామర్థ్యం కూడా ఉంది.13 మెగా ఫిక్షల్ కెమెరాతో పాటు 5

మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

 

Nokia Lumia 638

7

విండోస్ ఫ్లాట్ పాం మీద నోకియా కంపెనీ రిలీజ్ చేసిన ఈ ముబైల్ ధర రూ.5 999 నుంచి ఫ్రారంభం అవుతుంది. 1 జిబి ర్యామ్ తో పాటు 8 జీబి ఇంటర్నెల్ స్టోరేజి కలిగి 128 జిబి వరకు విస్తరించుకునే సామర్థ్యం

కలిగి ఉంది. 5 మెగా ఫిక్షల్ కెమెరాతో LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. నోకియా లూమియా 638 ఫ్రంట్ కెమెరాతో లభించడం లేదు.

 

Motorola Moto E 4G

8

దీని ధర రూ. 7999.మొటొరోలా కంపెనీ రిలీజ్ చేసిన ఈ ముబైల్ 4.5 డిస్ ప్లే తో 1 జిబి ర్యామ్ కలిగి ఉంది. 8 జీబి ఇంటర్నెల్ స్లోరేజి తో విస్తరణ సామర్థ్యం 32 వరకు ఉంది. 5 mp కెమెరాను కలిగి 0.3 mp ఫ్రంట్ కెమెరాతో 2 లాలీపాప్ వర్షన్. 2జీ, 3జీ, 4జీ సపోర్ట్ తో పని చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here we are suggesting some latest 4g smartphon under 6000 rs, which is pocket friendly to indina users.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting