ఈ ఎనిమిది ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రూ. 8 వేలకు పైగానే..

Written By:

ఈ కామర్స్ కంపెనీలు ఇప్పుడు డిస్కౌంట్లను వదిలేసి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మీద పడినట్లు తెలుస్తోంది. దిగ్గజ కంపెనీ ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ కామర్స్ సైట్లు మాత్రమే కాకుండా టెలికాం ఆపరేటర్లు సైతం ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ల మత్తులో వినియోగదారులను ముంచుతున్న సంగతి తెలిసిందే. ఆఫర్ల వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

జనవరి 9 నుంచి మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ X

పేటీఎంలో రూ. 4000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
దిగ్గజ మొబైలై సంస్థ ఆపిల్ ఐఫోన్ Xపై పేటీఎంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. పేటీఎం ద్వారా దీన్ని కొనుగోలు చేసిన వారికి రూ .4000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.

శాంసంగ్ నోట్ 8

అమెజాన్ లో రూ .8000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
అమెజాన్ పే ను వాడుతూ నోట్ 8 ను కొనుగోలు చేసినవారు వారికి రూ .8000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాగా ఫోన్ కస్టమర్ కు పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్ పేలో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు. చివరి తేదీ జనవరి 10.

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్

పేటిఎం మీద రూ .6000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్
పేటీఎం ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారు రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను అందుకుంటారు.

మోటో జీ 5 ఎస్ ప్లస్

పేటీఎంలో రూ .1,625 క్యాష్‌బ్యాక్ ఆఫర్
మోటో జీ 5 ఎస్ ప్లస్ కొనుగోలు చేసిన వారికి పేటీఎంలో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. ఈ ఆఫర్ క్రింద ప్రతి యూజర్ మూడు ఆర్డర్లను బుక్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. కొనుగోలు జరిగిన 24 గంటల తర్వాత ఈ మొత్తం క్రెడిట్ అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ జే 7 మ్యాక్స్

వొడాఫోన్ ద్వారా రూ .1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్
గెలాక్సీ జే 7 మ్యాక్స్ కొత్త, పాత వినియోగదారులకు వొడాఫోన్ రూ .1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఎం-పైసా వాలెట్ల ద్వారా దీన్ని అందిస్తోంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లిందరికీ ఇది అందుబాటులో ఉంటుంది.

వివో వీ 7 ప్లస్

పేటీఎంలో రూ .1,100 క్యాష్‌బ్యాక్ ఆఫర్
పేటీఎం ద్వారా దీన్ని కొనుగోలు చేసిన వారికి రూ .1100 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను పేటీఎం అందిస్తోంది.

10.ఆర్ డీ స్మార్ట్ఫోన్

జియో ద్వారా రూ .1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్
10.ఆర్ డీ కొనుగోలు చేసిన జియో ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్ లో రూ .1500 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అయితే యూజర్లు కనీసం రూ .199 తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 cool smartphones available at up to Rs 8,000 cashback Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot