Honor 8Xలో ఆ 8 ఫీచర్లు కెవ్వు కేక..
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను మనం పరిశీలించినట్లయితే ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీగా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‍లు దూసుకొస్తున్నాయి.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను మనం పరిశీలించినట్లయితే ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీగా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‍లు దూసుకొస్తున్నాయి. ఇందుకు ప్రధానమైన కారణం మొబైల్ టెక్నాలజీలో చోటుచేసుకుంటోన్న ఆధునిక పోకడలే. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రొవైడ్ చేస్తున్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో హానర్ (Honor) ఒకటి రూ.15000 బడ్జెట్‌లోఈ బ్రాండ్ లాంచ్ చేసిన మరో ఫోనే హానర్ 8 (Honor 8X). బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో హై-ఎండ్ ఫీచర్స్‌తో ఎన్-రిచ్ కాబడిన ఈ ఫోన్ 8 అంశాల్లో మార్కెట్ బెస్ట్ అనిపిస్తోంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫుల్ హెచ్‌డి ప్లస్ నాట్చ్ డిస్‌ప్లే
నాట్చ్ డిస్‌ప్లే ట్రెండ్ మార్కెట్‌ను షేక్ చేస్తోన్న నేపథ్యంలో హానర్ తన 8ఎక్స్ డివైస్‌ను ఫుల్ హెచ్‌డి ప్లస్ (1080×2340 పిక్సల్స్) నాట్చ్ డిస్‌ప్లేతో క్రాఫ్ట్ చేసింది. ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ బోర్డర్‌లెస్ నాట్చ్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే వీడియో స్ట్రీమింగ్‌తో పాటు వీడియో గేమింగ్‌కు మరింత అనువుగా ఉంటుంది. 91% స్ర్కీన్ టు బాడీ రేషియోతో వస్తోన్న ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే ఫోన్‌లో మల్టీ మీడియా ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ క్వాలిటీతో ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

గ్లోసీ బ్యాక్ ప్యానల్...
రూ.15,000 బడ్జెట్‌లో ఐ-క్యాచీ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హానర్ 8ఎక్స్‌కు గ్లోసీ బ్యాక్ ప్యానల్ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ప్యానల్‌ను గ్లోసీ టెక్స్ట్యుర్డ్ గ్లాస్ ఫినిషింగ్‌తో హానర్ క్రాఫ్ట్ చేసింది. 14 లేయర్ల రిచ్ రిఫ్లెక్టివ్ క్రాఫ్ట్‌మెన్‌షిప్‌తో రూపుదిద్దుకున్న ఈ గ్లోసీ బ్యాక్ ప్యానల్ ఒకే సమయంలో రెండు రకాల విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఈ ఫోన్ డిజైనింగ్‌లో ఇంప్లిమెంట్ చేసిన చిప్ ఆన్ ఫిల్మ్ టెక్నాలజీ ఫోన్ థిక్‌నెస్‌ను రెడ్యూస్ చేసి స్లిమ్ లుక్‌ను తీసుకువస్తుంది. స్లీక్ బాడీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఆపరేట్ చేసేసుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...
సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన ఇన్-హౌస్ EMUI 8.1 యూజర్ ఇంటర్‌ఫేస్ పై హానర్ 8ఎక్స్ రన్ అవుతుంది. ఈ యూఐ మరింత యూజర్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. బ్లు లైట్‌ను నిరోధించే క్రమంలో కొత్త జనరేషన్ కంఫర్ట్ మోడ్‌ను హానర్ ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసింది. స్మార్ట్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టం, బ్యాటరీ సేవింగ్ మోడ్స్ ఇంకా విభిన్నమైన హోమ్ స్క్రీన్ స్టైల్స్‌ను ఈ ఇంటర్ ఫేస్ ద్వారా హానర్ పరిచయం చేస్తోంది.

బెస్ట్ గేమింగ్ ఫోన్..
రూ.15,000 బడ్జెట్‌లో లభ్యం కానున్న బెస్ట్ గేమింగ్ ఫోన్ హానర్ 8ఎక్స్ గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఇన్-హౌస్ జీపీయూ టర్బో టెక్నాలజీ బెస్ట్ క్లాస్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు ప్రొవైడ్ చేస్తుంది. కిరిన్ 710 చిప్‌సెట్‌తో కంభైన్ అయి వచ్చే ఈ టెక్నాలజీ లాగ్ ఫ్రీ గేమ్ ప్లేను యూజర్‌కు ప్రొవైడ్ చేస్తుంది. గ్రాఫికల్ గేమ్స్ ను సైతం ఈ టెక్నాలజీ సునాయాశంగా హ్యాండిల్ చేయగలుగుతుందట.

బెస్ట్ క్వాలిటీ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్..
రూ.15,000 బడ్జెట్‌లో లభ్యం కానున్న బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్‌గా హానర్ 8ఎక్స్ గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేసే ఫోటోగ్రఫీ సరికొత్త బెంచ్ మార్క్స్‌ను సృష్టించబోతోంది. హానర్ 8ఎక్స్‌లో ఎక్విప్ చేసిన 20 మెగా పిక్సల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మల్టీ-సీన్ రికగ్నిషన్ సపోర్టుతో క్యాటగిరీస్ ఇంకా సినారియోస్‌ను రియల్ టైమ్‌లో ఐడెంటిఫై చేయగలుగుతుంది.
ఈ కెమెరాలోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ మోడ్ ఏరియా సెగ్మింటేషన్‌ను బట్టి ఫోటోను అడ్జస్ట్ చేయటంతో పాటు రీటచ్ చేయగలుగుతుంది. ఫోన్ వెనుక భాగంలో 20 మెగా పిక్సల్ కెమెరాతో పాటుగా ఎక్విప్ చేసిన 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా డెప్త్ సెన్సింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ డ్యుయల్ కెమెరా సెటప్ బోకెహ్ ఎఫెక్ట్స్‌తో కూడిన స్టన్నింగ్ ప్రోర్ట్రెయిట్‌లను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా...
ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి హానర్ 8ఎక్స్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమెరాలో ఎక్విప్ చేసిన మల్టిఫ్రేమ్ ఎక్స్‌పోజర్ టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్‌లో తలత్తే ఓవర్ ఎక్స్‌పోజర్‌ను నియంత్రిస్తుంది. ఇదే సమయంలో సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకునేటపుడు స్టూడియో లెవల్ ఎఫెక్ట్స్‌ను ఈ కెమెరా ఆఫర్ చేస్తుంది.

కిరిన్ 710 చిప్‌సెట్ పై రన్ అవుతుంది..
ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి హానర్ 8ఎక్స్ కిరిన్ 710 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 12ఎన్ఎమ్ మాన్యుఫ్యాక్షరింగ్ ప్రాసెస్ పై బిల్ట్ కాబడిన ఈ సాక్ మునుపటి సీపీయూలతో పోలిస్తే మరింత ఖచ్చిత్తత్వంతో స్పందించగలుగుతాయి. ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి 4జీబి ఇంకా 6జీబి కాన్ఫిగరేషన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్..
స్టోరేజ్ ఇంకా బ్యాటరీ కనెక్టువిటీ పై పూర్తిస్థాయిలో దృష్టిలో సారించిన హానర్ తన 8ఎక్స్ డివైస్‌ను డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌తో అందిస్తోంది. ఈ డివైస్ లో ఏర్పాటు చేసిన ట్రిపుల్ స్లాట్ హైబ్రీడ్ సిమ్ కార్డ్ ట్రే ఏకకాలంలో రెండు సిమ్ లను రన్ అయ్యేలా చూడటంతో పాటు మెమురీ కార్డుకు చోటు కల్పిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ లో ఏర్పాటు చేసిన 3750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుంది.

ధర ఇంకా అందుబాటు..
ఇండియన్ మార్కెట్లో హానర్ 8ఎక్స్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. అక్టోబర్ 24 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి+64జీబి స్టోరేజ్‌తో లభ్యమవుతుంది. ధర రూ.14,999. ఇక రెండవ వేరియంట్ విషయానికి వచ్చేసరికి 6జీబి+64జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. దర రూ.16,999. మూడు వేరియంట్ వచ్చేసరికి 6జీబి+128జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది ధర రూ.18,999.


Click it and Unblock the Notifications








