Home
Mobile

మీరు కొనేందుకు బెస్ట్ 8జీబి ర్యామ్ మొబైల్స్

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి.

By Gizbot Bureau

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఫోన్ మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 2జీబి, 3జీబి, 4జీబి, 6జీబి, 8జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. నేటి స్పెషల్ ఫీచర్ స్టోరీలో భాగంగా 8జీబి ర్యామ్ కెపాసిటీతో మార్కెట్లో లభ్యమవుతోన్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వల్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 5టీ (OnePlus 5T)

వన్‌ప్లస్ 5టీ (OnePlus 5T)

6.01 అంగుళాల డిస్‌ప్లే విత్ 1080×2160 పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టం, 2.45గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.33,000లోపుగా ఉంది.

రాజర్ ఫోన్ (Razer Phone)

రాజర్ ఫోన్ (Razer Phone)

ప్రముఖ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ కంపెనీ రాజర్, Razer Phone పేరుతో సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 2017లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.7 అంగుళాల డిస్‌ప్లే, దీని రిసల్యూషన్ కెపాసిటి వచ్చేసరికి 1440×2560 పిక్సల్స్, లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ (Asus ZenFone AR)

ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ (Asus ZenFone AR)

8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి Asus ZenFone AR బెస్ట్ ఛాయిస్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి.. 5.7 అంగుళాల భారీ డిస్‌ప్లే, రిసల్యూషన్ కెపాసిటి వచ్చేసరికి 1440×2560 పిక్సల్స్, ట్యాంగో ఆగ్‌మెంటెడ్ రియాల్టీ ప్లాట్‌ఫామ్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ధర రూ.49,000.

వన్‌ప్లస్ 6 (OnePlus 6)

వన్‌ప్లస్ 6 (OnePlus 6)

8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి వన్‌ప్లస్ 6 మరో బెస్ట్ ఛాయిస్. ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఇదే సమయంలో ధర కూడా రీజనబుల్‌గా ఉంది. డివైస్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 6.28 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ కెపాసిటి వచ్చేసరికి 1080×2280 పిక్సల్స్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 2.8గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ ధర రూ.35,000.

 

 

షియోమీ ఎంఐ మిక్స్2 (Xiaomi Mi MIX 2)

షియోమీ ఎంఐ మిక్స్2 (Xiaomi Mi MIX 2)

షియోమీ నుంచి లాంచ్ అయిన ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 8జీబి ర్యామ్ సామర్థ్యంతో లభ్యమవుతోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.99 అంగుళాల డిస్ ప్లే,రిసల్యూషన్ కెపాసిటి వచ్చేసరికి 1080×2160 పిక్సల్స్, లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటిగ్ సిస్టం, ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

 

Best Mobiles in India

English summary
8GB RAM Mobiles: Best Android Smartphone To Buy In 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X