మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో స్టోరేజ్ సమస్యలా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను స్టోరేజ్ స్పేస్ సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నస్మార్ట్‌ఫోన్‌లలో ఈ సమస్య ప్రధాన అవరోథంగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్యలను అధిగమించేందుకు పలు చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
Read More : త్వరలో ఆర్డర్ పై Jio SIM, ఇంటికి తీసుకువచ్చి ఇస్తారు!

స్టెప్ 1
ఫోన్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీ ఆదా చేసుకోవచ్చు. ఇలా చేయటానికి Settings > Apps > Downloaded Appsలోకి వెళ్లి ఒక్కో యాప్‌ను సెలక్ట్ చేసుకుని "move to SD card" పై టాప్ చేయండి.

స్టెప్ 2
ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.

స్టెప్ 3
ఫోన్ యాప్స్‌కు సంబంధించి క్యాచీని తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ స్పేస్ ఆదా అవుతుంది. క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలవు.

స్టెప్ 4
ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం వ్వారా ఇంటర్నల్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.

స్టెప్ 5
ఫోన్ ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అయిన ఫోటోలు, వీడియోలను ఎస్డీ కార్డులోకి మూవ్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.

స్టెప్ 7
ఫోన్‌లోని డేటాను క్లౌడ్ అకౌంట్‌లలో స్టోర్ చేసుకోవటం ద్వారా మెమరీ ఆదా అవుతుంది.

స్టెప్ 7
ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.settings > Privacy and Security > Clear Cache and History


Click it and Unblock the Notifications