హెచ్‌టీసీ వెలాసిటీ ‘4జీ’ స్మార్ట్ ఫోన్!!

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఆధునిక ఉత్పత్తుల పై దష్టి సారిస్తూ వినియోగదారులు మన్ననలు చొరుగుంటున్న ‘హెచ్‌టీసీ’ (HTC) వేగవంతమైన కనెక్టువిటీకి దోహదపడే ఎల్‌టీఈ వ్యవస్థతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా గ్యాడ్జెట్‌కు సంబంధించి హెచ్‌టీసీ నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటనా లేదు.
‘హెచ్‌టీసీ వెలాసిటీ 4జీ’గా త్వరలో రాబోతున్న ఈ మొబైల్‌కు సంబంధించి ఫీచర్లు (అంచనా మాత్రమే):
* 5 అంగుళాల స్ర్కీన్ (క్యూ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో),
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
* 8 మెగా పిక్సల్ కెమెరా,
* ఎల్‌టీఈ వ్యవస్థ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ యాక్సిస్,
ఉన్నతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానాన్ని ఈ మొబైల్ డిజైనింగ్‌లో వినియోగించినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఈ డివైజ్ విడుదలకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








