ఫ్లాష్..ఫ్లాష్ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు హ్యాకర్ల ముప్పు..!!

Posted By:

 ఫ్లాష్..ఫ్లాష్ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు హ్యాకర్ల ముప్పు..!!

 

అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నారా..?, తస్మాత్ జాగ్రత్త. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ఒక లోపం కారణంగా హ్యాకర్లు చాలా సులభంగా మీ ఫోన్లు, ఇతర పరికరాలను నియంత్రణలోకి తెచ్చుకోగలరని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఆ బగ్‌ను ఉపయోగించి కొన్ని రకాల ఆండ్రాయిడ్ పరికరాల పై ఎలా దాడులు చేయొచ్చో క్రౌడ్‌స్ట్ర్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలోని పలువురు నిపుణులు పెదవి విప్పారు. వచ్చేవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరగనున్న కంప్యూటర్ భద్రతా సదస్సులో ఈవివరాలను క్రౌడ్‌స్ట్ర్రైక్ సంస్థ వివరించనుంది. హ్యాకర్లు చాలా నమ్మకస్తులు పంపినట్లుగా ఓ ఎస్ఎంఎస్ గానీ, ఈ మెయిల్ గానీ పంపుతారని లింకును క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ వారి నియంత్రణలోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఇక అప్పటినుంచి ఫోన్‌కు వచ్చే, వెళ్లే కాల్స్ వివరాలు, ఫోన్ ఎక్కడుందో అన్నవిషయం అన్ని తెలిసిపోతాయని క్రౌడ్‌స్ట్ర్రైక్ సహ వ్యవస్థాపకుడు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డిమిట్రీ అల్పెరోవిచ్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot