ఐఫోన్ 16 ప్రో మోడల్ కెమెరా కంట్రోల్ బటన్‌తో ఒక్కరోజులో ఎలాంటి అనుభూతి కలిగిందంటే?
ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (iPhone 16) భారత్ మార్కెట్‌లో సెప్టెంబర్ 20 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా ప్రో మోడల్ అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లను కలిగి ఉంది. కెమెరా కంట్రోల్ ఫీచర్ సహా మరిన్ని ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఐఫోన్ 16 ప్రో మోడల్ కెమెరా కంట్రోల్ బటన్ (iPhone 16 Pro Camera Control Button) అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌లు మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 ప్రో మోడల్‌లోని కెమెరా కంట్రోల్ బటన్‌ను ఒక్కసారి press చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. అదే బటన్‌ను నొక్కి పట్టుకుంటే ఫోటో క్యాప్చర్ అవుతుంది. అదే బటన్‌ను నొక్కి పట్టుకుంటే వీడియోను రికార్డు చేస్తుంది. ఒక్క బటన్‌తో ఎన్నో ఆప్షన్‌లను కలిగి ఉంది. జూమ్, స్టైల్, డెప్త్ వంటి ఎన్నో ఆప్షన్లున్నాయి. మరియు సెట్టింగ్స్ మార్చేందుకు ఆ బటన్‌ను రెండుసార్లు Press చేయాల్సి ఉంటుంది.

ఐఫోన్ 16 ప్రో మోడల్ కెమెరా కంట్రోల్ బటన్‌తో ప్రారంభంలో కొద్దిగా తడబాటు అనిపించింది. అయితే కొంత సేపటికి ఈ బటన్‌ను ఎలా వినియోగించాలనేది తెలిసింది. ఫలితంగా మంచి అనుభూతి కలిగింది. ఒక బటన్‌తో ఎన్నో ఆప్షన్‌లను నియంత్రించవచ్చు. జూమ్ ఇన్, జుమ్ అవుట్ సహా ఎన్నో ఆప్షన్‌లు ఉన్నాయి.
ఈ కెమెరా కంట్రోల్ బటన్‌ను భవిష్యత్‌లో మరిన్ని అప్‌గ్రేడ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లు జోడించే అవకాశం ఉంది. కొన్ని సర్దుబాట్ల కోసం టచ్‌స్క్రీన్ కచ్చితమైనదిగా అనిపిస్తోంది. అయితే భవిష్యత్‌లో టూ స్టేజ్ షట్టర్ తరహాలో అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోకస్, ఫోటో క్యాప్చర్ చేసేందుకు మెరుగైన ఆప్షన్‌లు ఉండే అవకాశం ఉంది.
ప్రో మోడల్‌ను కొంత సమయం వినియోగించాక.. కెమెరా కంట్రోల్ ఫీచర్ ల్యాండ్‌స్కేప్‌లో ఫోటోలు, వీడియోలు క్యాప్చర్ చేసేవారికి అనుకూలంగా ఉంటుందని తెలిసింది. ఫోన్‌ను నిలువుగా పెట్టి ఫోటోలు, వీడియోల రికార్డు చేసేందుకు సౌకర్యవంతంగా లేదు. ఐఫోన్ ఈ తరహా ఫీచర్‌తో ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోలను క్యాప్చర్ చేసేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
అయితే ఈ కెమెరా కంట్రోల్ ఫీచర్‌లో కొన్ని అసౌకర్యాలు ఉన్నా.. భవిష్యత్‌లో అప్‌గ్రేడ్‌ల ద్వారా మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. మరింత సమయం వినియోగించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ల విడుదల అనంతరం.. ఈ మోడల్ ఫోటోగ్రాఫర్‌ల మెరుగైన ఎంపికగా మారే అవకాశం ఉంది.

గత మోడల్ కంటే ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులోకి వచ్చిన కెమెరా కంట్రోల్ బటన్ మరో ముందడుగుగా భావించవచ్చు. అయితే నేటికి విప్లవాత్మకమైన అడుగుగా భావించకపోయినా.. మొబైల్ ఫొటోగ్రఫీకి ప్రత్యేకమైనది కావచ్చు. అయితే భవిష్యత్‌లో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో, ఎలాంటి అప్‌గ్రేడ్‌లను పొందనుందో వేచిచూడాల్సి ఉంది.
ఐఫోన్ 16 ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. f/1.78 అపేచర్‌తో కూడిన 48MP వైడ్ ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, f/2.8 అపేచర్, టెట్రా ప్రిజమ్ పెరిస్కోప్ లెన్స్, 5X ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 12MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/1.9 అపేచర్‌తో కూడిన 12MP ట్రూ డెప్త్ కెమెరాను కలిగి ఉంది.
ఈ కెమెరాలు 120fps వద్ద 4k నాణ్యతతో కూడిన వీడియోలను రికార్డు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భారత్‌లో ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,29,990, 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,69,900 గా ఉంది.


Click it and Unblock the Notifications








