తరచూ ప్రయాణాలు చేసే వారి కోసమే..

Posted By: Staff

తరచూ ప్రయాణాలు చేసే వారి కోసమే..

 

తరచుగా ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఓ సరిక్రొత్త మొబైల్ 'స్నాప్‌ఫోన్ ఎజ్ వన్-సి'ని ప్రవేశపెట్టింది. గతంలో విడుదలైన 'స్నాప్‌ఫోన్ ఎజ్ వన్' మొబైల్‌కి అనుసంధానంగా 'స్నాప్‌ఫోన్ ఎజ్ వన్-సి' మొబైల్‌ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ మొబైల్ ప్రత్యేకతలను గనుక గమనించినట్లైతే ఉపయోగించేందుకు చాలా సింపుల్‌గా ఉండడమే కాకుండా యూజర్స్‌కు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు.

మొబైల్ గ్రే కలర్‌లో చూసేందుకు చూడముచ్చటగా ఉండడంతో పాటు, పెద్ద పెద్ద బటన్స్ దీని సొంతం.  ఎల్‌సిడి స్క్రీన్ దీని ప్రత్యేకత. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 1.6 ఇంచ్‌లుగా రూపొందించడమే కాకుండా 128 x 48 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ఈ మొబైల్‌లో బ్లూటూత్, కెమెరా లాంటి అధునాతన ఫీచర్స్ లేకపోవడం యూజర్స్‌ని ఒకింత నిరాశకు గురి చేసే విషయం.

ఎంటర్టెన్మెంట్ కోసం ఇందులో ముందుగా ఎఫ్‌‌ఎమ్ రేడియోని నిక్షిప్తం చేశారు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 3, 000/-గా నిర్ణయించడమైంది. పాఠకులకు  'స్నాప్‌ఫోన్ ఎజ్ వన్-సి' మొబైల్‌ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'స్నాప్‌ఫోన్ ఎజ్ వన్-సి' మొబైల్‌ ప్రత్యేకతలు:

* GSM phone

* Simple to use

* Good reception

* High call quality

* FM radio

* Weight:76.54 gram

* 3-5 hours talk time

* 90-120 hours stand by

మొబైల్‌‌లో అందుబాటులో లేనివి:

* No Bluetooth

* Increased ear phone volume preferred

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting