OPPO Find X8 Pro స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఎందుకు గట్టి పోటీనిస్తోంది.. 5 కారణాలివిగో..!
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్, ఫ్లాగ్‌షిప్ మోడళ్లూ చూసిన పోటీ తీవ్రంగా ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో యూజర్లకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. వాటి నుంటి వారు వివిధ ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో OPPO Find X8 Pro స్మార్ట్‌ఫోన్ ఎక్కడా రాజీలేని అల్ట్రా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోనే బెస్ట్ కెమెరాలను కలిగి ఉంది. అత్యంత నాణ్యమైన కెమెరా పనితీరును అందిస్తుంది. దీంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కూడిన బ్యాటరీ ఎక్కువ సమయంలో పాటు లైఫ్‌ను అందిస్తుంది. బెస్ట్ హార్డ్‌వేర్ సహా అధునాత సాఫ్ట్‌వేర్ మరియు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఫలితంగా భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మీరు మెరుగైన అనుభూతిని అందించే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఒప్పో ఫైండ్ X8 ప్రో మీకు మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

1.క్వాడ్ 50MP కెమెరాలతో రీడిఫైన్ మొబైల్ ఫోటోగ్రఫీని అందిస్తుంది
ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ హాసెల్‌బ్లాడ్ కెమెరాను యూనిట్‌ను కలిగి ఉంది. ఇదే ఈ హ్యాండ్‌సెట్‌లో హైలెట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్ ఏకంగా నాలుగు 50MP కెమెరాలను కలిగి ఉంది. OIS సపోర్టుతో కూడిన 50MP సోనీ LYT808 కెమెరా, ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP శాంసంగ్ ISOCELL JN5 అల్ట్రావైడ్ కెమెరా, OIS సపోర్టుతో 50MP సోనీ LYT600 పెరిస్కో్ప్ కెమెరా మరియు OIS మరియు f/4.3 అపేచర్‌తో 50MP సోనీ IMX858 పెరిస్కోప్ కెమెరాలను కలిగి ఉంది.

ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న యూజర్లు.. ఫోటోలు, వీడియోల షూటింగ్ సమయంలో ప్రొఫెషనల్ కెమెరా ఉన్న అనుభూతిని పొందుతారు. సూర్యాస్తమయం లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ ఫోటోలు క్యాప్చర్ చేస్తున్నా.. లైటింగ్‌తో సంబంధం లేకుండా ఈ ఫోన్ ప్రైమరీ కెమెరాతో అత్యంత నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఏదైనా ట్రిప్‌కు వెళ్లిన సందర్భాల్లో దూర ప్రాంతాల్లో వస్తువులను క్యాప్చర్ చేసేందుకు ఈ ఫోన్ జూమింగ్ సామర్థ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ కింద ఉన్న ఫోటో ఆల్బమ్ పైన క్లిక్ చేయడం ద్వారా ఈ ఒప్పో ఫైండ్ జూమింగ్ సామర్థ్యాలను తెలుసుకోవచ్చు. 0.6x నుంచి 120x మ్యాగ్నిఫికేషన్ సామర్థ్యాలను తెలుసుకోవచ్చు.

30X, 60X జూమింగ్ సామర్థ్యాల ద్వారా అత్యంత స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. మైలు దూరంలోని ఫోటోలను క్యాప్చర్ చేసేందుకు ఏఐ టెలిస్కోప్ జూమ్ 10X వద్ద క్యాప్చర్ చేయగలదు. 10X కంటే మరింత జూమ్ చేసేందుకు అడ్వాన్స్‌డ్ ఏఐ ద్వారా మరింత స్పష్టంగా క్యాప్చర్ చేయవచ్చు.
హాసెల్‌బ్లాడ్ మోడ్ పొర్ట్రెయిట్ విషయానికి వస్తే అత్యంత స్పష్టమైన షాట్స్ క్యాప్చర్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. బ్యాగ్రౌండ్ బ్లర్‌గా మారుతుంది. మరియు ఫోటో అత్యంత స్పష్టంగా క్యాప్చర్ చేస్తుంది. ఫోటోను మరింత అందంగా మార్చేందుకు సాఫ్ట్ లైటింగ్ పొర్ట్రెయిట్ ఫీచర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కింది కెమెరా శాంపిల్స్‌ను పరిశీలించండి.

యాక్షన్‌తో కూడిన అనుభూతులను క్యాప్చర్ చేసేందుకు లైవ్ ఫోటో సరిగ్గా పనిచేస్తుంది. ఎంత వేగంగా వస్తువులు లేదా వ్యక్తులు కదులుతున్నా... క్రిస్టల్ క్రియల్‌గా ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. క్విక్ బటన్ ద్వారా ఫోటోలను ఆకట్టుకొనే విధంగా క్యాప్చర్ చేయవచ్చు.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ అన్ని కెమెరాల ద్వారా డాల్బీ విజన్ సపోర్టుతో 60fps వద్ద 4K నాణ్యతతో ఆండ్రాయిడ్ వీడియో షూటింగ్ ద్వారా రికార్డు చేయవచ్చు. 4K నాణ్యతతో 12X జూమింగ్ సామర్థ్యంతో 50MP కెమెరా ద్వారా సెల్ఫీలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు సాటిలేని అనుభూతిని అందిస్తాయి.

2. స్మార్ట్‌ఫోన్ అనుభూతిని మరింత ఎలివేట్ చేస్తుంది
ఒప్పో ఫైండ్ x8 ప్రో స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన స్పేస్ బ్లాక్ షేడ్‌లో అందుబాటులోకి వచ్చింది. బోల్డ్ స్టైలింగ్, చక్కనైన ఆకృతిని కలిగి ఉంది. దీంతోపాటు బ్రైట్, అప్‌లిఫ్టింగ్ గ్లోతో కూడిన పెర్ల్ వైట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. కెమెరాతోపాటు ఈ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో కూడిన స్లీక్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. దీంతోపాటు IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఫోన్ పైభాగంలో ఎడమ వైపునున్న అలెర్ట్ స్లైడర్ ద్వారా సైలెంట్, వైబ్రేట్ మరియు రింగ్ ఆప్షన్‌లను వినియోగించుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కర్వడ్ ప్రో XDR తో కూడిన 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ బెజెల్స్‌తో అందుబాటులో ఉంది. మరియు HDR10+ మరియు డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా మెరుగైన అనుభూతిని అందిస్తోంది.
ఈ ఫోన్ 2160Hz PWM డిమ్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫలితంగా కళ్లకు అసౌకర్యం కలగకుండా చూస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే TUV Rheinland Eye కంఫర్ట్ 4.0 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా రాత్రి వేళ్లల్లోనూ సౌకర్యవంతంగా స్మార్ట్‌ఫోన్ వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ డిస్‌ప్లే స్ప్లాష్ టచ్ సపోర్టు చేస్తుంది.
3. మెరుగైన పనితీరు కనబరిచే బ్యాటరీ
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ 5910mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది. సాధారణ లిథియం బ్యాటరీతో పోలిస్తే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీలు మెరుగైన పనితీరును అందిస్తాయి. మరియు బ్యాటరీ తక్కువ సైజులోనే ఉంటుంది, అయితే సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి డాల్బీ విజన్ వీడియో ద్వారా ఏకంగా 7 గంటలపాటు రికార్డు చేయవచ్చు. మరియు రోజంతా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయవచ్చు.

దీంతోపాటు ఈ ఫోన్ 80W SUPERVOOCTM ఛార్జింగ్ సపోర్టుతో కేవలం 55 నిమిషాల్లో పుల్ ఛార్జింగ్ చేయవచ్చు. ఫ్లాగ్‌షిర్ ఫోన్‌లలో తొలిసారిగా ఒప్పో సంస్థ ఈ ఫోన్‌ను ఒప్పో మ్యాగ్ సపోర్టుతో 50W AIRVOOCTM ఛార్జింగ్ సపోర్టును అందిస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ 10W రిజర్వ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
4.అద్భుతమైన మొబైల్ పనితీరు
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్ TSMC సెకండ్ జనరేషన్ 3nm మరియు ARM V9 ఆర్కిటెక్చర్ పై నిర్మించారు. ఫలితంగా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లోనే అత్యంత మెరుగైన పనితీరును అందిస్తుంది. దీంతోపాటు NPU పనితీరును కలిగి ఉంటుంది.
ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్‌ను AnTuTU మరియు గీక్‌బెంచ్ 6 లో టెస్టింగ్ చేయబడింది. ఇప్పటివరకు పరీక్షించిన అత్యుత్తమ పనితీరు కలిగిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా నిలిచింది. దీంతోపాటు ఈ ఫోన్ అడ్వాన్సడ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫలితంగా భారీ టాస్క్‌లలోనూ స్థిరమైన పనితీరును అందిస్తుంది.

ఈ ఫోన్ ట్రినిటీ ఇంజిన్, ఈ చిప్‌సెట్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది మరియు ఫోన్ పనితీరు మరియు బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరుస్తుంది. ఈ ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ మెరుగైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది. PUBG, Free Fire, Genshin Impact గేమ్స్ సమయంలోనూ స్థిరమైన పనితీరును కనబరుస్తుంది. ఈ ఫోన్ AI లింక్ బూస్ట్ టెక్నాలజీ నిరంతరాయమైన మల్టీప్లేయర్ గేమింగ్ కోసం స్థిరమైన నెట్‌వర్క్ కనెక్షన్‌ను అందిస్తుంది. 20 యాంటెనాలతో కూడిన 360 డిగ్రీల పరిధిలో యాంటెన్నాను కలిగి ఉంది.
5. మెరుగైన పనితీరును కనబరుస్తుంది
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 తో పనిచేస్తుంది. ఫలితంగా అత్యంత మెరుగైన అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు AI టూల్‌బాక్స్, సర్కిల్ టూ సెర్చ్, టచ్ టూ షేర్, ఏఐ ఫోటో రీమాస్టర్, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ స్టూడియో వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి.



మల్టీ టాస్కింగ్ సమయాల్లోనూ స్మూత్ యూనిమేషన్లను అందిస్తుంది. 3D ఎఫెక్ట్, డైనమిక్ బ్లర్ ద్వారా మెరుగైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్ అధిక పనితీరు అందించేలా రూపొందించారు. ఎక్కువ యాప్‌లు ఒకేసారి ఓపెన్ చేసినా ప్రతిస్పందించే విధంగా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.
అంచనాల కంటే దీటైనా పనితీరు కనబరిచే స్మార్ట్‌ఫోన్
అత్యంత పోటీ కలిగిన స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో, ఒక స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత చాటడం అంత సులభం కాదు. అయితే ఒప్పో ఫైండ్ X8 ప్రో మాత్రం తన పనితీరుతో ప్రత్యేకంగా నిలుస్తుంది. నాణ్యమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేసే సామర్థ్యం కలిగిన కెమెరాలున్నాయి. దీంతోపాటు రికార్డు బ్రేకింగ్ పనితీరును కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన ఛార్జింగ్ సామర్థ్యాలు కలిగిన బ్యాటరీని కలిగి ఉంది.

మరియు ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ AI సామర్థ్యాలను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన పనితీరును అందిస్తుంది. ఏ విషయంలోనూ రాజీలేని, ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఒప్పో ఫైండ్ x8 ప్రో స్మార్ట్‌ఫోన్ అనుకూలంగా ఉంటుంది. మా అభిప్రాయం ప్రకారం అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు అందించగలిగిన ఏకైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా నిలిచింది.

భారత్‌లో ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర
ఈ ఫోన్ 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99,999 గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 3 వ తేదీ నుంచి ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.9999 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications