సోనీ హై క్లాస్ స్మార్ట్‌ఫోన్...

Posted By: Staff

సోనీ హై క్లాస్ స్మార్ట్‌ఫోన్...

 

సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్7 త్వరలో మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న స్మార్ట్ ఫోన్. మార్కెట్లోకి విడుదలకు ముందే ఇంటర్నెట్ యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోలు హాల్ చల్ చేస్తున్నాయి. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.3 ఇంచ్ WVGA టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

1.2GHz స్నాప్ డ్రాగెన్ MSM8260 CPUని నిక్షిప్తం చేశారు. ఇందులో ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా, 720p ఫార్మెట్లో వీడియోని రికార్డింగ్ చేయవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఎఫ్‌ఎమ్ రేడియో అదనం. పాఠకులకు సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్7 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా....

* 4.3-inch WVGA touchscreen

* 8-megapixel camera

* Windows Phone 7 OS

* GPRS/GSM/WAP/EDGE Quad Band

* 3G/HSDPA/HSPA

* SMS, MMS, Email

* Social networking

* Stereo Bluetooth v2.1 connectivity

* USB connectivity

* 3.5mm jack

* MicroSD card slot

* Surround sound from Dolby Digital Plus

* MP3 Polyphonic WAV MIDI vibration ringtone

* Wi-Fi 802.11n

* Navigation maps and A-GPS

* Standard Li-Ion battery

సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్7 మొబైల్‌లో ఇంటర్నల్‌గా 512MB RAMని నిక్షిప్తం చేయగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యూజర్స్‌ కొసం ఇందులో పొందుపరచిన విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కొత్త ఆప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో స్టాండర్డ్ Li-Ion బ్యాటరీని నిక్షిప్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot