జడ్‌టిఈ రేసర్ ఆండ్రాయిడ్ ఫోన్..

Posted By: Super

జడ్‌టిఈ రేసర్ ఆండ్రాయిడ్ ఫోన్..

 

చైనా టెలికమ్యూనికేషన్స్ గెయింట్ అయిన 'జడ్‌టిఈ కార్పోరేషన్' మొబైల్ మార్కెట్లో తక్కువ కాలంలో గుర్తింపుని తెచ్చుకున్న మొబైల్ సంస్ద. జడ్‌టిఈ మొబైల్ కంపెనీ విడుదల చేసిన అన్ని రకాల మొబైల్ సిరిస్‌లలో సక్సెస్‌ని సాధించిన మొబైల్ సిరిస్ రేసర్ సిరిస్. సాధారణంగా మార్కెట్లో ఏదైనా సిరిస్ సక్సెస్‌ని సాధించింది అంటే చాలు, ఈ సిరిస్‌లో పలు రకాల మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటిదే ఇక్కడ కూడా జరిగింది.

జడ్‌టిఈ తన రేసర్ సిరిస్ లోకి మరో కొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది దాని పేరు 'జడ్‌టిఈ రేసర్ II'. తక్కువ ఖరీదులో ఇండియన్ కస్టమర్స్‌ని ఇట్టే ఆకర్షించేటటువంటి తత్వం కలిగిన మొబైల్ ఫోన్. 'జడ్‌టిఈ రేసర్ II' మొబైల్ బరువు 100 గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 104 mm x 55.4 mm x 13.5 mm. కస్టమర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2.8 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది.

టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, స్కీన్ రిజల్యూషన్ 240x 320 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను యూజర్స్ తీయవచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో Broadcom BCM2157 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు .

'జడ్‌టిఈ రేసర్ II' మొబైల్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, వై -పై లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను 3.5mm ఆడియో జాక్‌ ఉచితం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1100mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

 'జడ్‌టిఈ రేసర్ II' మొబైల్ ప్రత్యేకతలు

ప్రాసెసర్:Qualcomm7227-1 processor

ఆపరేటింగ్ సిస్టమ్:Google Android 2.1

డిస్ ప్లే:2.8in touchscreen display

కెమెరా:3.2Mp camera

మెమరీ:256MB of built-in memory (comes with 2GB microSD card)

కీప్యాడ్:onscreen qwerty keyboard

జిపిఎస్:GPS

ఎఫ్ ఎమ్ రేడియో:FM radio

మ్యూజిక్ ప్లేయర్:media player

మొబైల్ చుట్టుకొలతలు:55x102x15mm

మొబైల్ బరువు:100g

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot