Home
Mobile

OnePlus 6 రికార్డ్ సేల్, 22 రోజుల్లో 10 లక్షల ఫోన్‌ల అమ్మకాలు

తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus 6ను 22 రోజుల్లో 10 లక్షల మంది యూజర్లు కొనుగోలు చేసినట్ల వన్‌ప్లస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

By Bommu Sivanjaneyulu

తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus 6ను 22 రోజుల్లో 10 లక్షల మంది యూజర్లు కొనుగోలు చేసినట్ల వన్‌ప్లస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో భాగంగా ఆ సంస్థ సీఈఓ పీటర్ లా మాట్లడుతూ తమ కమ్యూనిటీకి అంచనాలకు మించిన ఆదరణ లభిస్తోందని, ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు. సంస్థ చెబుతోన్న లెక్కల ప్రకారం OnePlus communityలో 50 లక్షలకు పై యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఈ ఫోరమ్స్‌కు ప్రతినెలా కోటికి పైగా వీక్షణలు లభిస్తున్నాయి.

కమ్యూనిటీ సెలబ్రేషన్ సీజన్..

కమ్యూనిటీ సెలబ్రేషన్ సీజన్..

ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ‘Community Celebration Season' పేరుతో సరికొత్త సేల్‌ను వన్‌ప్లస్ అనౌన్స్ చేసింది. 2018, జూన్ 15వ తేదీన ప్రారంభమైన ఈ 12 రోజుల సేల్ జూన్ 26తో ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ ఉత్పత్తులను సిటీబ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇదే సమయంలో no-cost EMI పద్ధతిలో వన్‌ప్లస్‌6 స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకునే వీలును కల్పించారు.

రూ.1500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ..

రూ.1500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ..

ఈ 12 రోజుల ఆఫర్ సేల్‌లో భాగంగా తమ పాత వన్‌ప్లస్ ఉత్పత్తులను కొత్త వన్‌ప్లస్ ఉత్పత్తులతో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటోన్న యూజర్లకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూతో పాటు రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో non-OnePlus ఉత్పత్తులను కొత్త వన్‌ప్లస్ ఉత్పత్తులతో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటోన్న యూజర్లకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూతో పాటు రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవటం ద్వారా 3 నెలల ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్స్..

6.28 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ నాచ్ డిస్‌ప్లే విత్ 19:9 స్ర్కీన్ రేషియో అండ్ 401 పీపీఐ, గ్లాస్ డిజైన్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం.

హైక్వాలిటీ కెమెరా యూనిట్..

హైక్వాలిటీ కెమెరా యూనిట్..

20 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ పోర్ట్రెయిడ్ మోడ్ ఫీచర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 3300 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ. ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ 6 (6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ఇదే సమయంలో (6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్) వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. అమెజాన్ ఇండియా వీటిని ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Best Mobiles in India

English summary
OnePlus said that its its flagship model, OnePlus 6, has crossed 1 million sales mark globally within 22 days of the launch of the device.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X