వామ్మో.. ఆ ఫోన్ బ్యాకప్ 15 సంవత్సరాలా..?

Posted By: Prashanth

వామ్మో.. ఆ ఫోన్ బ్యాకప్ 15 సంవత్సరాలా..?

 

‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ ఓ బృహత్తర ఆవిష్కరణకు వేదిక కానుంది. 15 సంవత్సారాల బ్యాటరీ లైఫ్ నిచ్చే ‘స్పేర వన్ మొబైల్’ను ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన సింగిల్ ఏఏ (AA) బ్యాటరీ బ్యాకప్ విషయంలో పూర్తి సంతృప్తినిస్తుంది. ఈ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే రాదు. ఏ సమమయంలోనైనా వాడుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీల నిమిత్తం దూర ప్రాంతాలు ప్రయాణించే వారికి ఈ స్పేర్ వన్ మొబైల్ దోహదపడుతుంది.

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* 15 సంవత్సరాల స్టాండ్ బై నిచ్చే AA బ్యాటరీ,

* టాక్ టైమ్ 10 గంటలు,

* డ్యూయల్ బ్యాండ్ జీఎస్ఎమ్,

* ఆకర్షణీయమైన డిజైన్,

* మన్నికైన పనితీరు,

* అన్ని వయస్సుల వారికి సరితూగే తత్వం,

ఏఏ బ్యాటరీతో వస్తున్న మొట్టమొదటి మొబైల్ ఇదే. ఇంత స్టాండ్ బై టైమ్ ఏ ఇతర మొబైల్ ఇవ్వలేదు. ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్ ధర రూ.2,600 (అంచనా మాత్రమే).ఇక పై స్పేర్ వన్ మొబైల్‌తో నిశ్సింతైన ప్రయాణాలను సాగించండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot