రిచ్‌గా ఉండాలనుకుంటున్నారా ఐతే ఈ ఫోన్ వాడాల్సిందే

Posted By: Super

రిచ్‌గా ఉండాలనుకుంటున్నారా ఐతే ఈ ఫోన్ వాడాల్సిందే

2011వ సంవత్సరం మొబైల్ హ్యాండ్ సెట్ తయారీదారులకు పెద్ద పోటీ సంవత్సరం లాగా కనిపిస్తుంది. అందుకు కారణం 2011లో ఆండ్రాయిడ్ మొబైల్ పోన్స్‌‌ని అన్ని కంపెనీలు కూడా కుప్పలు తెప్పలుగా విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నటువంటి ఎల్‌జీ కంపెనీ త్వరలో ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్‌ని గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. మొబైల్ పేరు ఎల్‌జీ ప్రాడా కె2. ఇప్పటికే ఎల్‌జీ ప్రాడా కె2కి సంబంధించిన సమాచారం అంతా ఇంటర్నెట్లో దర్శనమిస్తుంది.

ఎల్‌జీ ప్రాడా కె2 మొబైల్ ధనిక వర్గానికి సంబంధించిన మొబైల్. సాధారణంగా చాలా మంది రిచ్ నెస్ కోసం తాపత్రయపడుతున్నారు. వారు వేసుకున్నఫ్యాంట్ దగ్గర నుండి ధరించే ప్రతి వస్తువు కూడా అత్యంత ఖరీదైనదిగా ఉండాలి. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకోని ఎల్‌జీ ప్రాడా కె2 మొబైల్ తయారుచేయడం జరిగింది. ప్రాడా సహాయంతో ఎల్‌జీ ప్రాడా కె2 మొబైల్‌ని రూపోందించడం జరిగింది కాబట్టి దీనికాపేరు పెట్టడం జరిగింది. మంచి లగ్జరీ, టెక్నాలజీకి ఈ మొబైల్ పెట్టింది పేరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎల్‌జీ ప్రాడా కె2 ఫీచర్స్ విషయానికి వస్తే యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసం 4.3 ఇంచ్ టచ్ స్క్రీన్‌ కలిగి ఉంది. పెద్ద స్క్రీన్ సైజుతో మొబైల్‌ని రూపోందించడం వల్ల వీడియోస్, ఇమేజిలను చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇక హై రిజల్యూషన్ పిక్చర్స్ ని కెమెరాలో బంధించడానికి గాను ఇందులో 8 మెగా ఫిక్సల్ కెమెరాని పోందుపరచడం జరిగింది. ఈ కెమెరా సహాయంతో 720p ఫార్మెట్లో హై డేఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు. అంతేకాకుండా చీకట్లో కూడా చక్కని ఫోటోలను తీసేందుకు గాను ఎల్‌ఈడి ప్లాష్‌ని కూడా పోందుపరచడం జరిగింది.

వీటితో పాటు మల్టీమీడియా ఆప్షన్స్ విషయంలో కస్టమర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయదు. యూజర్స్‌కు క్లాస్ ఎంటర్టెన్మెంట్ మ్యూజిక్‌ని అందించడంలో మొబైల్ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల వీడియో, ఆడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లు అయిన h263, h264లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో రాగా 3.5mm ఆడియో జాక్ ద్వారా స్పీకర్స్‌ని కనెక్ట్ చేసుకునే వీలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ మొదలగునవాటిని సపోర్ట్ చేస్తుంది.

మొబైల్‌‍తో పాటు 16జిబి ఇంటర్నల్ మొమొరీ రాగా మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎల్‌జీ ప్రాడా కె2 ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ 2.3.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వర్సన్‌తో రన్ అవుతుంది. మార్కెట్లో ప్రస్తుతానికి ఎల్‌జీ ప్రాడా కె2 సంబంధించిన ధరను విడుదల చేయలేదు. ఏదైనా కానీ ఇటువంటి అన్ని హాంగులు లగ్జరీ మొబైల్ ఫోన్‌గా పరిగణిస్తున్న ఎల్‌జీ ప్రాడా కె2 ధర కూడా కొంచెం లగ్జరీగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot