దీని రాకతో ప్రెగ్నెన్సీ ఆడవారి కష్టాలు తీరనున్నాయి..!!

Posted By: Staff

దీని రాకతో ప్రెగ్నెన్సీ ఆడవారి కష్టాలు తీరనున్నాయి..!!

టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందిందంటే స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర ఉత్పత్తులను కేవలం మాట్లాడడానికే కాకుండా, వేరే ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. కొత్త ఆలోచనల రూపకల్పనతో మొబైల్‌ని హెల్త్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ప్రముఖ మార్కెటింగ్ సంస్ద 'మోబిసనేట్' ఆద్వర్యంలో కొత్త ఆల్ట్రా సౌండ్ స్మార్ట్ ఫోన్‌ని 'మొబియుఎస్' అనే పేరుతో మొబైల్ ఇండస్ట్రీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ 'మొబియుఎస్' అనే స్మార్ట్ ఫోన్ కొత్త టెక్నాలజీతో యూజర్స్‌కు అనుగుణంగా తయారు చేయబడింది.

'మొబియుఎస్' స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ఆల్ట్రా సౌండ్ ఇమేజింగ్ సిస్టమ్ అప్లికేషన్ సహాయంతో 'మెడికల్ డయోగ్నసిస్' కొసం ఉపయోగించనున్నారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ని 'మెడికల్ డయోగ్నసిస్'లో (పొత్తి కడుపు ఇమేజింగ్, గర్బస్ద దశలో అవయవాల పెరుగుదల ఆగిపోవడం)లాంటి వాటిని పరిక్షీంచడానికి ఉపయోగించనున్నారు. వీటితో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌ని రక్తనాళాల పరీక్షకు కూడా వినియోగించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ని అమెరికాలో ఉన్న హెల్త్ పరిశోధకులు పరిశీలించిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకొవడం జరిగింది. కేవలం ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆల్ట్రా సౌండ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడం జరుగుతుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఈ మొబైల్ ఫోన్‌ ఆడవారి ప్రెగ్నెన్సీ సమయంలో, ఉమ్మనీరు పనితీరు ఎలా ఉందనే విషయాలను కూడా దీనిని ఉపయోగించి తెలుసుకొవచ్చు. ఇక 'మొబియుఎస్' మొబైల్ ఫోన్ బాడీ ప్యానల్ విషయానికి వస్తే చాలా అందంగా తీర్చి దిద్దడం జరిగింది. ఈ మొబైల్‌ని ప్రత్యేకించి డాక్టర్స్, మెడికల్ టెక్నీన్సియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. 'మొబియుఎస్' స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 4.1 ఇంచ్‌గా తయారు చేయడం జరిగింది.

మెమరీ విషయంలో యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురి చేయదు. అందుకు కారణం 8జిబి వరకు మెమరీని స్టోర్ చేసుకునే కెపాసిటీ దీని సొంతం. వీటితో పాటు విండోస్ మొబైల్ 6.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. యుఎస్‌బి ఫెసిలిటీ ప్రత్యేకం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన విండోస్ ఎక్స్‌పి, విస్తా, విండోస్ 7లను కూడా ఇందులో వినియోగించుకొవచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ఖరీదు సుమారుగా రూ 3, 37, 500 వరకు ఉండవచ్చునని నిపుణుల అంచనా...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot