శ్యామ్‌సంగ్ నుండి విండోస్ స్మార్ట్‌‍ఫోన్ ఐ937

Posted By: Staff

శ్యామ్‌సంగ్ నుండి విండోస్ స్మార్ట్‌‍ఫోన్ ఐ937

ప్రపంచం మొత్తం మీద మొబైల్ హ్యాండ్ సెట్ కంపెనీలకు ఇండియా హాట్ స్పాట్. ప్రతి ఒక్క కంపెనీ కూడా తమయొక్క స్ట్రాటజీలను ఇండియన్ మొబైల్ మార్కెట్‌ని తృప్తిపరచడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదే కోవలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ దారుసంస్ద అయినటువంటి శ్యామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లో తనయొక్క షేర్ వాల్యూని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇండియాలో త్వరలో శ్యామ్‌సంగ్ నుండి విండోస్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. శ్యామ్‌సంగ్ త్వరలో విడుదల చేయనున్న విండోస్ స్మార్ట్ ఫోన్ పేరు శ్యామ్‌సంగ్ ఐ937.

వివరాల ప్రకారం ఇటీవలే ఈ మొబైల్ బ్లూటూత్ ఎస్ఐజి సర్టిఫికెట్‌ని పోందడం జరిగింది. టెక్నికల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనియొక్క బ్లూటూత్ వర్కింగ్ అనేది విండోస్ 7మ్యాంగో ఫ్లాట్ ఫామ్ మాదిరే ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ మొబైల్‌కి ఉన్నటువంటి మరో ముఖ్యమైన ఫీచర్ విండోస్ 7లో ఉన్న అన్ని రకాల గేమ్స్ ఇందులో పోందుపరచడం జరిగింది.

ఇక కంపెనీ అధికార ప్రతినిధి నుండి అందిన వార్తల ప్రకారం శ్యామ్‌సంగ్ గెలాక్సీ SIIని విడుదల చేస్తున్న సమయంలో శ్యామ్‌సంగ్ కంపెనీ కేవలం ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి పరిమితం కాకూడదనే ఉద్దేశ్యంతో విండోస్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడానికి పూనుకున్నట్లు తెలియజేశారు. ఇక శ్యామ్‌సంగ్ ఐ937 బేసిక్ రిక్వైర్‌మెంట్ ఏమిటంటే ఇది విండోస్ 7 ఫ్లాట్‌ఫామ్‌తో రన్ అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో 1GHz ప్రాసెసర్‌ని పొందుపరచారు. అంతేకాకుండా ఇందులో Qualcomm snapdragon ఛిప్‌ని అమర్చడం జరిగింది. మొబైల్ స్క్రీన్ సైజు కూడా 3.6 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉండి చూడడానికి ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

మార్కెట్లో ప్రస్తుతం ఉన్న విండోస్ మొబైల్స్‌లో ఏమేమి కొత్త ఫీచర్స్ ఉన్నాయో అటువంటి అన్ని రకాలైన ఫీచర్స్ ఇందులో పోందుపరచడం జరిగింది. 5మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ కూడా దీని ప్రత్యేకం. ముందుభాగాన ఉన్నటువంటి విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే లెటేస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీస్ అయినటువంటి బ్లూటూత్, వై-పై అన్నింటిని సపోర్ట్ చేస్తుంది. శ్యామ్‌సంగ్ ఐ937 బ్లూటూత్ ఎస్‌ఐజి సర్టిఫికెట్‌ని కూడా పోందింది.

మల్టీమీడియా విషయానికి వస్తే ఈ విండోస్ ఫోన్ అన్ని రకాల వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. దీనితోపాటు 3.5 mm ఆడియా జాక్‌తో ఆడియో, వీడియో సాంగ్స్‌ని ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్ ద్వారా ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల కానున్న ఈ శ్యామ్‌సంగ్ ఐ937 మొబైల్ ధరను ఇంకా నిర్ణయించలేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot