ఆకాష్ మొబైల్ విడుదల!

Posted By: Prashanth

ఆకాష్ మొబైల్ విడుదల!

 

దేశీయంగా కోన్కా  (Konka) స్మార్ట్‌ఫోన్‌లను పంపిణి చేస్తున్న ప్రముఖ టెక్ బ్రాండ్ మాక్ మొబిలిటీ  ‘ట్రయో’ బ్రాండ్ కింద మూడు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను ఆవిష్కరించింది. అగ్ని, ఆకాష్, పృథ్వీ మోడళ్లలో ఈ హ్యాండ్‌సెట్‌లు లభ్యంకానున్నాయి. వీటి ధరలు రూ.1,199 నుంచి రూ.2,999 మధ్య ఉన్నాయి. 2.6 అంగుళాల డిస్‌ప్లే, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,  జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, స్టీరియో బ్లూటూత్ వంటి స్పెసిఫికేషన్‌లు ఈ మూడు ఫోన్‌లలో సమాన ప్రాతిపదికను కలిగి ఉంటాయి.

ఆకాష్ (టీ2424), అగ్ని(టీ2626) మోడళ్లు ఎంపీత్రీ ఇంకా ఎఫ్ఎమ్ స్టీరియోతో కూడిన కింగ్ మూవీ హైడెఫినిషన్ వీడియో ప్లేయర్ అప్లికేషన్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు1.3 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను కలిగి 16జీబి మెమరీ కార్డ్‌ను సపోర్ట్ చేస్తాయి. మరో మోడల్  పృథ్వీ (టీ2020) వీజీఏ కెమెరాను కలిగి స్పెషల్ బాక్స్ స్పీకర్లతో  ఉత్తమ క్వాలిటీ  ఆడియోను ఉత్పత్తి చేస్తుంది.

యాపిల్ ఆఫీస్‌లు (వరల్డ్ వైడ్)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot