'ఏసర్' పెద్ద ప్లాన్‌తోనే అలా చేస్తుంది..!!

Posted By: Staff

'ఏసర్' పెద్ద ప్లాన్‌తోనే అలా చేస్తుంది..!!

ఎక్కువ హంగు ఆర్భాటాలు ఉండేటటువంటి సమర్ధవంతమైన పనితీరు కలిగి ఉండే మొబైల్ పరికరాన్ని సగటు వినియోగదారుడు కోరుకుంటాడు.
అటువంటి వారి కోసం ‘ఏసర్’ సంస్థ ప్రత్యేకించి ఓ సరికొత్త మొబైల్ ఫోన్‌ని రూపొందించనుంది. దాని పేరు 'ఏసర్ అల్లిగ్రో'. వన్ ఇండియా పాఠకుల కొసం 'ఏసర్ అల్లిగ్రో' ఫీచర్స్ ని క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏసర్ నోట్ బుక్స్‌ని అమ్మడంలో ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్దానంలో ఉన్న విషయం అందిరికి తెలిసిందే.

'ఏసర్ అల్లిగ్రో' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకించి మైక్రోసాప్ట్ విండోస్ మ్యాంగో 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. గతంలో ఏసర్ కంపెనీ నుండి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో 'ఏసర్ నియో టచ్' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడం జరిగింది. టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు, 3.7 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. 1 GHz స్నాప్ డ్రాగెన్ ప్రాససెర్‌తో పాటు, Adreno 205 GPU దీని సొంతం. మొబైల్‌తో పాటు 8జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. RAM కెపాసిటీ 512 MB.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో యూజర్స్ హై క్లారిటీ ఇమేజిలను తీయవచ్చు. ఆటో ఫోకస్, ఫ్లాష్ కెమెరా అదనపు ఫీచర్స్. ఇదే కెమెరాతో 720p వీడియో రికార్డింగ్‌ని తీసి మీ యొక్క అందమైన క్షణాలను భద్రపరచుకొవచ్చు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం. ఇక మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పై, జిపిఎల్ లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో ఏసర్ అల్లిగ్రో మొబైల్ ఖరీదు సుమారుగా రూ 15,800 వరకు ఉండవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot